ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత ప్రయోజనాల కోసం ఏపీని చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు. తను దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే ఆయన సింగపూర్ కు వెళ్తుంటారని ఆరోపించారు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపడతామన్నారు. బాబు ఆస్తులపై విచారణ జరిపితే ఆయన జైలు కెళ్లడం ఖాయమన్నారు. కాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగే ఓటింగ్ లో పాల్గొంటామన్నారు.. అయితే బీజేపీకి మద్దతిచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు


జమిలి ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తునట్లు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ‘లా కమిషన్‌’కు లేఖ అందించారు. ఈ సందర్భంగా విజయసారెడ్డి మాట్లాడుతూ జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందని, ఓటుకు నోటు లాంటి కేసులు ఉండవని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు తరచుగా జరుగుతుండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. జమిలి ఎన్నికలకు వైసీపీ అనుకూలమని..ఇదే  అభిప్రాయాన్ని ‘లా కమిషన్’ కు అందజేశామని విజయసారెడ్డి వెల్లడించారు