YS Jagan: ఏపీలో మరో ఎన్నిక.. గెలుపు గుర్రాన్ని ప్రకటించిన మాజీ సీఎం జగన్
Vizianagaram Local Bodies MLC Election YSRCP Candidate: ఏపీలో వివిధ కోటాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీని ఖాతాలో వేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో స్థానంపై కన్నేసింది. ఈ సందర్భంగా గెలుపు గుర్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
YSR Congress Party: లోక్‌సభ, శాసన సభ ఎన్నికలు ముగిసిన ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నిక దూసుకొచ్చింది. అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఒక స్థానాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ఎమ్మెల్సీ సీటుపై కన్నేసింది. ఈ సందర్భంగా ఆ స్థానం బలమైన అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టారు. గెలుపు గుర్రాన్ని పట్టేయడంతో మరోసారి తమదే విజయమని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: YS Vijayamma: వైఎస్ విజయమ్మ సంచలన వీడియో.. జగన్ హత్యాయత్నంపై ఖండన
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. పార్టీ నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. నాయకుల అభిప్రాయం మేరకు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పల నాయుడు పేరును జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీగా అతడి గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: Manda Krishna: పవన్ కల్యాణ్‌పై మంద కృష్ణ ఆగ్రహం.. అనితను అవమానిస్తావా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు అవకాశం ఇవ్వడంతో ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడుకు అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనుభవం, సామాజికవర్గం రీత్యా అప్పలనాయుడు పేరును ప్రకటించినట్లు వెల్లడించారు. సమష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని.. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలని పార్టీ నాయకులకు జగన్ పిలుపునిచ్చారు.
గెలుపు పక్కా?
విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 ఉన్నారు. వీరిలో 592 మంది వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఏ రకంగా చూసినా విజయనగరంలో వైసీపీ జెండా మరోసారి ఎగురుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధులను గాలం వేసేందుకు సిద్ధంగా ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు స్థానిక ప్రజాప్రతినిధులకు తాయిలాలు ఇచ్చి.. టూర్లకు పంపించి ఎలాగైనా ఈ సీటును సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. అధికార పార్టీ బేరసారాలకు తలొగ్గితే మాత్రం వైసీపీకి ఈ సీటు దక్కకపోవచ్చు.
అభ్యర్థి నేపథ్యం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ప్రకటించిన అభ్యర్థి శంబరి చినఅప్పలనాయుడు నేపథ్యం బలంగా ఉంది. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో చిన్నఅప్పలనాయుడు కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ప్రొటెం స్పీకర్‌గా పని చేశారు. విజయనగరంలో స్థానికంగా మంచి పట్టు ఉన్న నాయకుడు చిన్నఅప్పలనాయుడు గుర్తింపు పొందారు. పార్టీ బలం.. ఆయన అనుచరవర్గం సహాయంతో గెలుస్తారని వైఎస్సార్‌సీపీ ధీమాతో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.