Ambati Rambabu: అంబటికి దిమ్మతిరిగే షాక్.. సత్తెనపల్లికి కొత్త ఇంచార్జ్?
Guntur Politics: మాజీమంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారా..! మాజీమంత్రి ఇలాకాలోకి మరోనేతను రంగంలోకి దింపారా..! ఇన్నాళ్లు సత్తెనపల్లి కొత్త ఇంచార్జ్‌గా ఉన్న అంబటి రాంబాబును జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు..! ఇప్పుడు కొత్త నేతను ఎందుకు నియమించినట్టు..! సత్తెనపల్లిలో రాజకీయాలు అంబటి డీల్ చేయాలేరని కొత్త ఇంచార్జ్‌కు బాధ్యతలు అప్పగించబోతున్నారా..!
Ambati Rambabu: మాజీమంత్రి అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు సత్తెనపల్లి ఇంచార్జ్‌గా ఉన్న అంబటి రాంబాబును జగన్ పక్కన పెట్టేశారు. సత్తెన పల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్‌ను నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి కొత్త ఇంచార్జ్‌గా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏ క్షణమైనా పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రావొచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేశారు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. సత్తెనపల్లి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉండగా.. అంబటి రాంబాబు ఆగడాలకు హద్దే లేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. అధికారంలో ఉన్నమనే సోయి లేకుండా.. రోడ్డు మీద డ్యాన్సులు చేయడం.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అంబటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో జగన్ అంబటిపై జగన్ సీరియస్ అయ్యారని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు. అయితే కొద్దిరోజులుగా అంబటి రాంబాబుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న వైఎస్‌జగన్ ఇప్పుడు సరైనా నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు.
అంతేకాదు అంబటి రాంబాబును ఇకమీదట ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని జగన్ చెప్పినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు పొన్నూరు ఇంచార్జుగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికే అవకాశం ఉంటుందని.. ఇక నుంచి తెర వెనుక రాజకీయాలకే పరిమితమైతే చాలని అంబటి రాంబాబుకు చెప్పినట్టు సమాచారం. అయితే జగన్ నుంచి ఊహించన షాక్‌తో అంబటి ఇప్పుడు ఏం చేస్తారనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా అంబటి రాంబాబుతో పాటు మరికొందరు ఇంచార్జ్‌లను కూడా వైసీపీ మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో మరికొందరు లీడర్లపై షాక్ తప్పదని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఇంచార్జ్ పదవి నుంచి తప్పించడంతో అంబటి వైసీపీలో కొనసాగుతారా..! లేదంటే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది..
Also Read: Pawan Kalyan: కేంద్రమంత్రిగా పవన్?.. ప్లాన్ మార్చిన మోడీ!
Also Read: Congress Politics: కేబినెట్ విస్తరణకు బ్రేక్.. అడ్డుపడిన నల్గొండ లీడర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.