AP Election Results: శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తిరిగి స్వస్థలాలు చేరుకుంటున్నారు. ఎన్నికలకు.. ఫలితాలకు మధ్య చాలా రోజుల గడువు ఉండడంతో విదేశాల బాట పట్టిన తిరిగి రాష్ట్రానికి వస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తోపాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైఎస్‌ షర్మిల తదితరులు ఏపీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Election Results: వైఎస్‌ జగన్‌కు భారీ మెజార్టీనా? పవన్‌ కల్యాణ్‌కా?.. కాయ్‌ రాజా కాయ్‌


 


దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచాయి. ఎన్నికల ప్రచారంతోపాటు ఎన్నికల సందర్భంగా జరిగిన హింస, ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీ భవిష్యత్‌కు కీలకమైన ఈ ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఫలితాలపై తెలంగాణలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పటిష్టంగా చేస్తోంది. 

Also Read: Diamonds Found: ఏపీలో వజ్రాల పంట పండుతోంది.. 3 రోజుల్లో కోట్ల విలువైన వజ్రాలు లభ్యం


 


ఈ నేపథ్యంలో పార్టీలు కూడా ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పోలింగ్‌పై అధ్యయనం చేసిన పార్టీలు ఫలితాల వెల్లడికి ముందు సమీక్షించనున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధినేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. ఫలితాలపై పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు రానున్నారు.


40 రోజులపాటు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని అలసిన నాయకులు దేశ, విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ పోలింగ్ అనంతరం కుటుంబంతో సహా లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో ఆయన తిరుగుముఖం పట్టనున్నారు. ఈ నెల 31వ తేదీన సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు సైతం జూన్ 1వ వరకు ఏపీకి చేరుకోనున్నారు. ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టూర్లకు వెళ్లిన వారంతా తిరిగు ముఖం పట్టనున్నారు.


ఇక అమెరికా, ఇటలీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో హైదరాబాద్‌ చేరుకోనున్నట్లు సమాచారం. ఒక రోజు హైదరాబాద్‌లో ఉండి అనంతరం ఏపీకి వెళ్లనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విదేశాలకు వెళ్లినట్లు లేరు. సినిమా షూటింగ్‌ లేదా వ్యక్తిగతంగా జీవితం పొందినట్లు సమాచారం. ఇక బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆమె 1వ తేదీ నాటికి రాజమండ్రికి చేరుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఏపీకి చేరుకోనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఆమె 3వ తేదీన కడప చేరుకుంటారని సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter