Task Force: చంద్రబాబుకు వైఎస్ జగన్ భారీ షాక్.. వారి రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
YSRCP Forms Special Task Force For Social Media Activists: ఆంధ్రప్రదేశ్‌లో తమ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కొనసాగుతుండడంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ప్రకటించారు.
YSRCP Task Force: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 50 మందికి పైగా అరెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది. అయితే తమకు అండగా ఉంటున్న సోషల్ మీడియా కార్యకర్తల రక్షణ కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతుండడంతో భయాందోళనలో ఉన్న తమ సోషల్ మీడియా బృందానికి జగన్ రక్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నారు.
Also Read: Chandrababu: మాజీ సీఎంగా జగన్‌ను.. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడం దేవుడు రాసిన స్క్రిప్ట్
సోషల్ మీడియా కార్యకర్తల అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గురువారం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 'అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం అందిచడంతోపాటు, వారికి భరోసా.. పరామర్శతో ఆత్మస్థైర్యం పెంచడం కోసం టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది' అని వైసీపీ వెల్లడించింది. ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆయా జిల్లాల్లోని పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని వివరించారు. అయితే టాస్క్‌ఫోర్స్‌ను ఉమ్మడి జిల్లాల వారీగా నియమించడం గమనార్హం.
Also Read: YS Jagan: చంద్రబాబుకు దమ్ముంటే నన్ను ఎమ్మెల్యేగా తొలగించాలి: వైఎస్ జగన్
వైసీపీ జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
- శ్రీకాకుళం - సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్
- విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్, జోగారావు
- వి«శాఖపట్నం - భాగ్యలక్ష్మి, కెకె రాజు
- తూర్పు గోదావరి - జక్కంపూడి రాజా, వంగా గీత
- పశ్చిమ గోదావరి - కె సునీల్‌కుమార్ యాదవ్, జయప్రకాశ్ (జేపీ)
- కృష్ణా జిల్లా మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి
- గుంటూరు - విడదల రజని, డైమండ్ బాబు
- ప్రకాశం - టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి
- నెల్లూరు - రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
- చిత్తూరు - గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
- అనంతపురం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేశ్ గౌడ్
- కడప - సురేశ్‌బాబు, రమేశ్ యాదవ్
- కర్నూలు - హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి