YS Jagan Called To YSRCP: వర్షాలు.. వరదలతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే భారీ వర్షాలతో జరిగిన కొన్ని విషాద సంఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RK Roja: పార్టీ మార్పుపై ఆర్‌కే రోజా సంచలన ప్రకటన.. తిరుమలలో మళ్లీ వివాదం


భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ప్రమాద ఘటనలపై మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి జరిగిన మరణాలు.. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్‌ సహా ఇద్దరు విద్యార్ధులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండ చరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందడం వంటి సంఘటనలపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని కోరారు.

Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు


భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని.. విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ సీఎం జగన్‌ తెలిపారు. ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయా ప్రాంతాల్లో భారీవర్షాల బాధితులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.