Vijay ai Reddy Vs Sharmila: బాబు కళ్లలో ఆనందం కోసమే.. షర్మిలకు విజయ్ సాయి రెడ్డి మాస్ కౌంటర్..
Vijay sai Reddy Vs Sharmila: చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూసేందుకే షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ రాజ్యసభ పక్ష నేత YCP MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇది ఆస్తి తగాదాకాదన్నారు. ఇది అధికారం కోసం జరుగుతున్న పోరాటం అన్నారు.
Vijay sai Reddy Vs Sharmila: షర్మిల ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు. APCC అధ్యక్షురాలిగా మాట్లాడారా? లేక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మాట్లాడారా? చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. మొత్తంగా షర్మిల చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ ను ఇక్కడ చదువుతున్నారంటూ మండి పడ్డారు. మొత్తంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో తల్లి, భార్య సహా ఎవరికీ రాజకీయాల్లో వద్దు అనే ఉద్దేశ్యంతోనే చెల్లికి ఎలాంటి పదవులు కట్టబెట్టలేదు. అదే కోవలో షర్మిలకు రాజకీయంగా దూరం పెట్టారు. ఒకపుడు జగనన్న ఒదిలిన బాణాన్ని చెప్పుకున్న షర్మిలా.. ప్రత్యర్థుల ఆమెనే ఓ బాణంలా ఉపయోగించి అన్నపై ప్రయోగిస్తున్నారనే కామెంట్స్ వైయస్ఆర్సీపీ వర్గాల నుంచి వినబడుతున్నాయి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నపుడే తన ఆస్తిని కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కూతురు వైయస్ షర్మిలకు సమానంగా పంచారు. ఇక జగన్మోహన్ రెడ్డి తను సొంతంగా కూటబెట్టుకున్న ఆస్తిలో చెల్లెలుకు ఆస్తి పంచారు. ఇలా ఆస్తి పంచిన అన్న బహుశా ప్రపంచంలో ఎవరు ఉండరేమో. అనిల్ అంబానీ వ్యాపారంలో నష్టపోతే అన్న ముఖేష్ అంబానీ అతన్ని ఏ విధంగా ఆదుకోలేదు. కానీ జగన్ మాత్రం తన స్వార్జితం నుంచి కొంత చెల్లి షర్మిలకు కట్టబెట్టిన విషయాన్ని వైసీపీ పార్టీ అభిమానులు షర్మిల తీరును ఎండగడుతున్నారు.
పదవి కోసం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నపై యుద్ధం ప్రకటించడాన్ని వైయస్ఆర్ అభిమానులు తప్పు పడుతున్నారు. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఓ పత్రికాధినేత అండ చూసుకొని షర్మిల అన్నపై ఆస్తి విషయమై రెచ్చిపోవడం సబబు కాదన్నారు. ఏది ఏమైనా ఇంటిగుట్టును రచ్చ కీడ్చిన వ్యక్తిగా షర్మిల వైసీపీ అభిమానుల మనసును తీవ్రంగా గాయపరిచయమైందన్నారు. ఎన్నికల సమయంలో కూడా ప్రత్యర్థులతో చేయి కలిపి అన్న జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టింది. ఇపుడు ఆస్తి విషయమై జగన్ ను చావు దెబ్బ కొట్టాలని చూస్తున్న ప్రత్యర్థులకు పాలిట ఆయుధంగా మారిందన్నారు. ఏది ఏమైనా జగన్, షర్మిల ఇష్యూ ఇంకా ఎంత దూరం పోతుందో చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter