దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ (YSR Jayanti) 71వ జయంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరిగింది. ఇడుపులపాయ ( Idupulapaya) లో ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Cm YS jagan) నివాళి అర్పించగా...మిగిలిన ప్రాంతాల్లో పార్టీ నేతలు అభిమానులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అభిమానులు నివాళులర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( ys rajasekharreddy) జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు. 71వ జయంతి పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ (ysr ghat) వద్ద ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  సహా కుటుంబసభ్యులతో కలిసి అంజలి ఘటించారు. నివాళి కార్యక్రమం అనంతరం వైఎస్ సతీమణి విజయమ్మ ( ys vijayamma) రచించిన నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. సహధర్మచారిణిగా విజయమ్మ జీవిత నేపధ్యమే ఈ పుస్తకం సారాంశంగా ఉంది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఇవాళ్టి నుంచి రెండు రోజులు కడప జిల్లాలోనే ఉండి...పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో జయంతి కార్యక్రమానికి  ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అందర్నీ అనుమతించారు.  ప్రతి ఒక్కరికీ ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే ఘాట్ లోకి వెళ్లనిచ్చారు. Also read: Polavaram: వేగం పుంజుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు