దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుకులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్పించారు.  వైఎస్‌ విజయమ్మ, షర్మిల, భారతిలు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు.


అన్నవరంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన జగన్‌


అటు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అన్నవరం సమీపంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


విశాఖ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 252వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులు అలర్పించిన అనంతరం జగన్‌ తన పాదయాత్రను అన్నవరం శివారు నుంచి ప్రారంభించారు. చోడవరం నియోజకవర్గం రేవళ్లు, ఖండేపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గౌరవరం, జి.జగన్నాథపురం మీదుగా పాదయాత్ర మడుగుల నియోజకవర్గంలోకి ప్రవేశించి వేచలం క్రాస్‌, ములకలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.