YS Jagan Gautam Adani Dispute: అధికారంలోకి ఆరు నెలలు గడుస్తున్నా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జగన్‌ వ్యవహారంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి ప్రభుత్వం ట్రెండ్‌గా మారిందని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ 'సీజ్‌ షిప్‌' వెనుక పెద్ద ప్లానే? నిజం తెలిసి టీడీపీ దిగ్భ్రాంతి


అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీకి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ పోర్టులన్నీ అప్పగించారని.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని 'ఎక్స్‌' వేదికగా వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. గౌతమ్‌ అదానీ లంచం వ్యవహారంలో వైఎస్‌ జగన్‌పై చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్‌ చేశారు. 'అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసినా ఏ ఒక్క ఆస్తిపై.. కనీసం ఒక్క చర్య కూడా లేదు. విచారణ కూడా దిక్కులేదు' అని తెలిపారు.

Also Read: YS Sharmila: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి


'రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు. కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు' అని వైఎస్‌ జగన్‌పై వైఎస్‌ షర్మిల ఆరోపణలు చేశారు. 'ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి?' అని నిలదీశారు. 'ప్రతి ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చింది' అని ఆరోపించారు.


'నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9 వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారు. 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారు. బీఓటీ కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అది. అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవు' అని వైఎస్‌ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. కళ్లు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారని ఆరోపించారు. మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారని షర్మిల విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు.. ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదు అని మండిపడ్డారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.