Aarogyasri Scheme: ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి ఆరోపించారు. పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం తగదని పేర్కొన్నారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఆరోగ్య శ్రీ పథకం అని గుర్తుచేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Modi AP Tour: ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. తొలిసారి పర్యటనతో ఏపీకి ఏమీ వరాలు దక్కెను?


ఆరోగ్య శ్రీ పథకంపై సీఎం చంద్రబాబు మార్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల 'ఎక్స్‌' స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోపాటు బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవలను కొనియాడారు. 'ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చింది' అని మండిపడ్డారు.


Also Read: Modi AP Tour: 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. వరాల వర్షం కురిపించేనా..?


'రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా' అని వైఎస్‌ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. 'ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు' అని కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు.


'ఆరోగ్య శ్రీ పథకం బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉంది' అంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని సూచించారు. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని వైఎస్‌ షర్మిల కోరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook