వివేక హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ సునీత ప్రశ్నల వర్షం
వివేక హత్య కేసులో సిట్ దర్యాప్తు తీరును వైఎస్ సునీత తప్పుబట్టారు
వివేక హత్య కేసులో ఇప్పటి వరకు హంతకులు ఎవరనేది తేలకపోవడంతో ఆయన కటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ దర్యాప్తు కొలిక్కి రాకవపోవడంతో సిట్ దర్యాప్తుపై అనుమానం వ్యక్తం చేసున్నారు. ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరనేది తేల్చలేకపోయారని పోలీసుల తీరుపై విమర్శలు సంధిస్తున్నారు.
ఈ సందర్భంగా వివేక కూతరు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రి వివేక హత్య కేసులో సిట్ దర్యాప్తు సజావుగా ఎందుకు సాగడం లేదని..సిట్ పై ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేసున్నారు. హత్య జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికీ హంతకులు, కుట్ర దారులు ఎవరనేది ఇప్పటి వరకు ఎందుకు తేల్చాలేకపోయాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు
* వివేక డెడ్ బాడీని ఘటన స్థలం నుంచి తరలించమని సీఐకి చెప్పిందెవరు ?
* వివేక గుండెపోటుతో చనిపోయారని ఎవరు చెప్పారు ?
* బెడ్ రూంలో హత్య చేసి..డెడ్ బాడీని బాత్ రూంలోకి లాక్కెళ్లింది ఎవరు ?
* హత్య సమయంలో నిందితుడు పరమేశ్వర్ రెడ్డిని హోటల్ లో కలిసింది ఎవరు ?
* ఆదినారాయణరెడ్డిని సిట్ ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించడం లేదు ?
* ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు ఎందుకు వెనకేసుకు వస్తున్నారు ?
* హత్య కేసులో నిందితుడు బీటెక్ రవి పాత్ర ఏంటి ?
* తండ్రి వివేకను చంపింది ఎవరు.. అసలు ప్రధాన కుట్ర దారుడు ఎవరు ?