YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కారులో కర్నూలు వెళ్లారు వైఎస్ విజయమ్మ. తన  కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా.. అనంతపురం జిల్లా గుత్తి వద్ద ప్రమాదం జరిగింది. విజయమ్మ  ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోయింది. అయితే డ్రైవర్ కారును చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. ఈ ప్రమాదంలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన తర్వాత మరో కారులో విజయమ్మ హైదరాబాద్ వచ్చారు. ప్రమాదం నుంచి విజయమ్మకు సురక్షీతంగా బయపడటంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం


Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్....  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES