Avinash Reddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా న్యాయవ్యవస్థపై దాడి చేశారంటూ రెండు న్యూస్ ఛానెళ్లపై మండిపడ్డారు. బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు సీబీఐ తీరుని తప్పుబట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 17న దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ కీలక మలుపులు తిరుగుతూ చివరికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణకొచ్చింది. ఈ నెల 26, 27 తేదీల్లో అయితే ఇరువర్గాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనే జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


అవినాష్ రెడ్డి దర్యాప్తులో కలగజేసుకున్నారనేందుకు ఏ విధమైన ఆధారం లేదా ఆరోపణలు కూడా లేవని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. సాక్ష్యాల్ని ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించినట్టుగా సీబీఐ అతనిపై అభియోగాలు మోపినా.వాటిని ఆన్ రికార్డ్ చేసేలా సీబీఐ రుజువు చేయలేకపోయిందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ కార్యాలయానికి ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల మధ్యలో అవినాష్ రెడ్డి వెళ్లాలని, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది. 


కేసు వాదన సందర్భంగా వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సీబీఐ వైఖరిని ప్రశ్నలు వేశారు. ఇప్పటి వరకూ అనినాష్ రెడ్డి ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని సీబీఐని ప్రశ్నించారు. అప్రూవర్ స్వయంగా చెప్పినా సరే నిందితులు వివేకానందరెడ్డి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆస్థి పత్రాల్ని సీబీఐ స్వాధీనం చేసుకోలేకపోయిందని అడిగారు. 


మరోవైపు అనినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆ తరువాత అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలంపైనే సీబీఐ అతిగా ఆధారపడుతోందని ఆరోపించారు. దస్తగిరి వాంగ్మూలం తప్ప అవినాష్ రెడ్డి లేదా అతని తండ్రి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని అవినాష్ తరపు న్యాయవాదులు వాదించారు. 


అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ లక్ష్మణ్ కొన్ని తెలుగు టీవీ ఛానెళ్లు ప్రసారం చేసిన చర్చలపై విమర్శలు చేశారు. తనపై, తన సామర్ధ్యంపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం పట్ల జస్టిస్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత దాడిగా కాకుండా న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటివాటిపై చర్యలు తీసుకోవాలే లేదా అనేది తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ విచక్షణకు వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. 


Also read: TS High Court: ఆ రెండు తెలుగు ఛానెళ్లపై జస్టిస్ లక్ష్మణ్ ఆగ్రహం, చర్యలకు ఆదేశాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook