TS High Court: ఆ రెండు తెలుగు ఛానెళ్లపై జస్టిస్ లక్ష్మణ్ ఆగ్రహం.. చర్యలకు ఆదేశాలు!

TS High Court: వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ అయితే లభించింది గానీ..ఈ అశం ఇప్పుడు సంచలనంగా మారింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎం లక్ష్మణ్ ఆ రెండు ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2023, 10:01 AM IST
TS High Court: ఆ రెండు తెలుగు ఛానెళ్లపై జస్టిస్ లక్ష్మణ్ ఆగ్రహం.. చర్యలకు ఆదేశాలు!

TS High Court: అవినాష్ రెడ్డి బెయిల్ అంశం వ్యవహారంలో అతి ప్రదర్శించిన ఎల్లో మీడియాపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా..చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది..జస్టిస్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రెండు ఛానెళ్లు ఏంటి..

వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో బెయిల్ పై వాదనలు జరుగుతున్న సమయంలో ఏబీఎన్, మహా న్యూస్ ఛానెళ్లు అభ్యంతరకర వ్యాఖ్యానాలతో తన ప్రతిష్టను, న్యాయవ్యవస్థ కీర్తిని మంటగలిపేలా వ్యవహరించాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎం లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. 

తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎం లక్ష్మణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

నేను ప్రస్తుత పిటీషన్‌పై వాస్తవాలను లోతుగా పరిశోధించే ముందు, నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం, ఈ విషయంలో న్యాయమైన నిర్ణయం తీసుకోవడంలో స్వతంత్రంగా ఆలోచించకుడా బెదిరించే ప్రయత్నాలు చేయడం ద్వారా న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి, నిర్వీర్యం చేయడానికి  కొన్ని మీడియా సంస్థలు చేసిన కొన్ని ప్రయత్నాలను రికార్డ్ చేయాలని భావించాను.

కొన్ని ఛానెళ్లకు చెందిన కొందరు వ్యక్తులు నా ప్రతిష్టను దెబ్బతీసేలా తమకు నచ్చిన అభిప్రాయాల్ని ప్రసారం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రెస్ మరియు న్యూస్ మీడియా పట్ల నాకు చాలా గౌరవం ఉంది. మెరిట్స్‌కు అనుగుణంగా ప్రజాస్వామ్యంలో అవసరమైన ఏ నిర్ణయాన్నైనా వ్యక్తపరిచే హక్కు మీడియాకు ఉంది. అలాంటి అతి ముఖ్యమైన మీడియా ప్రతిష్ఠ రోజురోజుకూ కొంతమంది వ్యక్తుల కారణంగా దిగుజారుతోంది.

మరోవైపు సస్పెండ్ చేయబడి శిక్ష అనుభవించిన ఓ న్యాయమూర్తి తన వ్యాఖ్యల్లో డబ్బు సంచులు న్యాయముూర్తికి వెళ్లాయని నేరుగా దాడి చేశాడు. బాధ్యతాయుతమైన పదవి కలిగినట్టు కన్పించే ఆ వ్యక్తి అవమానకరమైన భాషను ఉపయోగించడమే కాకుండా కోర్టు ప్రక్రియలో కలగజేసుకున్నాడు. తన సామర్ద్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించాడు. 

ఈ తరహా చర్యలు సంస్థాగత ప్రతిష్టను దెబ్బతీస్తాయనేదే నా ఆందోళన. ఇలాంటి వ్యక్తుల వ్యాఖ్యల వల్ల కాదు గానీ అటువంటి వారిని కొన్ని మీడియాలు ప్రోత్సహించడం బాధాకరం. 

నా దృష్టిలో, అటువంటి చర్యలు స్పష్టంగా న్యాయస్థానాల ధిక్కరణ చట్టం కిందకు వస్తాయి. అయితే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలా లేదా అనేది నేను న్యాయస్థానం విచక్షణకు వదిలేస్తున్నాను. ఒక దశలో నేను ఈ విషయాన్ని వదిలేద్దామనుకున్నాను కానీ నిర్భయంగా విధుల్ని నిర్వహించాలనే సుప్రీంకోర్టు నిర్దేశాలు, చేసిన ప్రమాణం మేరుకు నా మనసు మార్చుకున్నాను.

ఈ ఉత్తర్వుతో పాటుగా ప్రస్తుత ప్రొసీడింగ్‌లపై 26-5-2023 న మహా న్యూస్, ఏబీఎన్ ఛానెళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగులను డౌన్‌లోడ్ చేసి గౌరవనీయ తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ముందు ఉంచాల్సిందిగా రెజిస్ట్రీని ఆదేశిస్తున్నాను. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవల్సిందిగా ఛీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వారిని కోరుతున్నాను.

Also Read: Avinash reddy Bail: అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News