వైఎస్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి (68) కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుఝామున పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. కాగా ఆయన  గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. వైఎస్ వివేకానందరెడ్డి మరణం వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మృతిపై ఆయన పీఏ కష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో  ఆయన మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందిచనున్నారు


1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ కు కుడిభజంలా వ్యవహరించిన  వివేకానంద రెడ్డి గతంలో రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.