Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డికి నోటీసులివ్వడం ఆసక్తి రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు అక్షింతలు, దర్యాప్తు అధికారి రాంసింగ్ తొలగింపు అనంతరం సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో దూకుడు పెంచింది. రెండ్రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ..ఇవాళ ఊహించని రీతిలో ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 


ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా కోరింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన రోజే అవినాష్ రెడ్డికి సైతం నోటీసులు అందడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డి ఒక్కరే మిగిలారు. రేపటి విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. 


రేపటి విచారణ కీలకం కానుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా అందరూ అరెస్టయినట్టే భావించాలి. అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిలు ఈ కేసులో వివేకా అల్లుడి పాత్ర ఉందని ఆరోపిస్తున్నా సీబీఐ దర్యాప్తు ఇప్పటివరకూ ఆ దిశగా సాగలేదు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ కారణాలతోనే వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ఆరోపిస్తున్నాయి. రేపు అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఏం జరుగుతుందోననే టెన్షన్ రేగుతోంది.


Also read: Ys Viveka Murder Case: వివేకా హత్యకేసులో కీలక పరిణామం, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook