Ys Viveka Murder Case: సీబీఐ అధికారి రాంసింగ్‌పై వేటు పడిన తరువాత కొంత స్తబ్దత కన్పించిన వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించని విధంగా ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు. పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు ఆయన్ని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. అక్కడ్నించి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టు సమాచారంతో ఆయన అనుచరులు పెద్దఎత్తున పులివెందులలోని ఇంటికి చేరుకున్నారు. ఇవాళ మద్యాహ్నం వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.
ఇదే కేసులో రెండ్రోజుల క్రితమే అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రిని సైతం అరెస్టు చేయడంతో కేసు ఆసక్తి రేపుతోంది. సీబీఐ అధికారుల వాహనాలను ఓ దశలో అడ్డుకునేందుకు అవినాష్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. వైఎస్ భాస్కర్ రెడ్డిపై సీబీఐ సెక్షన్ 130 బి రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేసింది. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్టు సమాచారాన్ని ఆయన భార్య వైఎస్ లక్ష్మికి ఇచ్చారు. ఆయన పోన్ కూడా సీబీఐ అధికారులు సీజ్ చేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి వివేకా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా గూగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్టు కావడంతో..ఇక అవినాష్ రెడ్డిని కూడా త్వరలో అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతోంది.
Also read: Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. ఈ తప్పులు చేస్తే దర్శనానికి అనుమతి ఉండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook