Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం, దర్యాప్తు అధికారి మార్పుకు ఆదేశాలు
Viveka Murder Case: వైఎఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. దర్యాప్తు అధికారిని తక్షణం మార్చాలని ఆదేశించింది.
Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇంకెంతకాలం విచారిస్తారని ప్రశ్నించింది. దర్యాప్తును సాగదీయడం మంచిది కాదని..హత్యలోని విస్తృత కుట్రకోణాన్ని వెలికి తీయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సీబీఐ విచారణ తీరును ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఆర్ షా దర్యాప్తు చేశారు. సీబీఐ దర్యాప్తు జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసు దర్యాప్తు అధికారిని తక్షణం మార్చాలని లేదా మరొకరిని నియమించాలని జస్టిస్ ఎంఆర్ షా ఆదేశించారు. స్టేటస్ రిపోర్టులో ఏ విధమైన పురోగతి కన్పించలేదని..ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని మండిపడ్డారు. దోషుల్ని పట్టుకునేందుకు ఈ కారణాలు సరిపోవని, వివేకా హత్యకేసులో విస్తృత కుట్ర ఉన్నందున బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని కూడా సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది.
ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐ తీరును జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని, ఓ ముగింపు ఉండాలని సూచించారు. 2021 నుంచి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు, విచారణ పూర్తి చేసేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలంటూ మండిపడ్డారు. ఈ కేసులో సీబీఐ సమర్పించిన సీల్డ్ కవర్ రిపోర్ట్ మొత్తం చదివామని..అన్నింట్లోనూ రాజకీయ కోణమే కారణమని రాసుకొచ్చారని మండిపడ్డారు. మెరిట్స్ ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఉన్న అధికారి తీరు చూస్తుంటే..కేసును ముగించే పరిస్థితి లేనట్టుగా ఉందని జస్టిస్ ఎంఆర్ షా అసహనం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook