Ambati Rambabu: తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని తిరుపతి ఉపఎన్నిక(Tirupati Bypoll) పోలింగ్ సమీపిస్తోంది. తిరుపతి ఎన్నికల( Tirupati Elections) ప్రచారంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ( Chandrababu Naidu)పై రాళ్ల దాడి జరిగిందనే వార్త వైరల్ అవుతోంది. ఈ దాడి వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. ఇప్పుడీ విషయంపైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత , ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పెద్ద డ్రామాకు తెరలేపారని..రాళ్ల దాడి జరిగిందంటూ దుష్ఫ్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు జెండా ఉంది గానీ..అజెండా లేదన్నారు.చంద్రబాబుకు ఏం చేయాలో తోచక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే స్థితిలో టీడీపీ లేదని..అసలు టీడీపీ పనైపోయిందని అచ్చెన్నాయుడు, పార్టీ కార్యకర్తలే చెబుతున్నారన్నారు.


పవన్ కళ్యాణ్( Pawan kalyan) కరోనాకు భయపడి క్వారెంటైన్‌కు వెళ్లారో లేదా కరెన్సీ అందలేదని క్వారెంటైన్‌కు వెళ్లారో తెలియదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు(Ambati Rambabu). కరోనా దృష్టిలో ఉంచుకుని జేపీ నడ్డా( Jp Nadda)తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదని చెబుతున్నారన్నారు. రాష్ట్రానికి బీజేపీ( Bjp) ఏం మేలు చేసిందో జేపీ నడ్డా చెప్పలేకపోయారన్నారు.వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి జేపీ నడ్డా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. టీడీపీ, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 


Also read: Ugadi Panchangam 2021: జగన్, కేసీఆర్ జాతకాలు సూపర్..మరి కష్టాలెదురయ్యే ఆ పెద్ద నేత ఎవరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook