Ysr Congress party: రాష్ట్రంలోని 26 జిల్లాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులు వీరే
Ysr Congress party: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ ప్రక్షాళన కోసమా..లేదా పార్టీలో కొందరికి ఇతర బాధ్యతలు అప్పగించేందుకా అనేది ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ ప్రకటించింది.
ఏపీలోని 26 జిల్లాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించిన కొత్త అధ్యక్షుల జాబితాలో కొన్ని మార్పులున్నాయి. ఇందులో 8 మంది జిల్లా అధ్యక్షుల్ని మార్చగా..మిగిలినవారు యధావిధిగా ఉన్నారు. 26 జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలను నియమించారు. పార్టీ కొత్త అధ్యక్షులిగా నియమితులైన వారి జాబితా ఇదీ..
విజయనగరం జిల్లా మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను
పార్వతీపురం మన్యం జిల్లా పరీక్షిత్ రాజు
అల్లూరి సీతారామరాజు జిల్లా కే భాగ్యలక్ష్మి
విశాఖపట్నం జిల్లా పంచకర్ల రమేశ్
అననకాపల్లి జిల్లా కరణం ధర్మశ్రీ
కాకినాడ జిల్లా కురసాల కన్నబాబు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొన్నాడ వెంకట సతీష్ కుమార్
తూర్పు గోదావరి జిల్లా జక్కంపూడి రాజా
పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
ఏలూరు జిల్లా ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని
కృష్ణ జిల్లా పేర్ని వెంకట్రామయ్య నాని
ఎన్టీఆర్ జిల్లా వెల్లంపల్లి శ్రీనివాస్ రావు
గుంటూరు జిల్లా డొక్కా మాణిక్య వరప్రసాద్
బాపట్ల జిల్లా మోపిదేవి వెంకటరమణ
పల్నాడు జిల్లా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం జిల్లా జంకే వెంకట్ రెడ్డి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కర్నూలు జిల్లా బి వై రామయ్య
నంద్యాల జిల్లా కాటసాని రాంభూపాల్ రెడ్డి
అనంతపురం జిల్లా పైలా నర్శింహయ్య
శ్రీ సత్యసాయి జిల్లా ఎం శంకర్ నారాయణ
వైఎస్సార్ కడప జిల్లా కే సురేష్ బాబు
అన్నమయ్య జిల్లా గడికోట శ్రీకాంత్ రెడ్డి
చిత్తూరు జిల్లా కే నారాయణ స్వామి
తిరుపతి జిల్లా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్లను కూడా పార్టీ అధిష్టానం మార్చింది. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నానిలను పార్టీ బాధ్యతల్నించి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేడి రాజుకోవడంతో ఈ నలుగురికి పార్టీలో ఇతర బాధ్యతలు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Also read: Ysrcp New Coordinators: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు, నలుగురికి ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook