YSR Kalyanamastu Scheme, YSR Shaadi Thofa Scheme: అమరావతి: పిల్లల చదువు ఇంటికి వెలుగు  – ఇల్లాలి చదువు వంశానికే వెలుగు అన్న మాటను స్పూర్తిగా తీసుకుని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకవైపు పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు అండగా నిలబడుతూ, మరోవైపు ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో, బాల్య వివాహాలను నివారించడం, పిల్లల చదువులను ప్రోత్సహించడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్ధికంగా ఆదుకోవడానికి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉపయోగపడుతున్నాయని ఏపీ సర్కారు అభిప్రాయపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.


వధూవరులు ఇద్దరికీ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి
కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే మన లక్ష్యం కాదు, వందకు వంద శాతం గ్రాడ్యుయేట్‌లుగా మన పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు ప్రభుత్వం 10వ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా, వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించింది. చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 1వ తరగతి నుండి ఇప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000 ల జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్‌ వరకు కూడా ఇస్తుండడంతో విద్యార్థినుల ఇంటర్‌ చదువు సాకారం అవుతుంది.


అలాగే కళ్యాణమస్తు, షాదీ తోఫాలలో వధువుకు 18 ఏళ్ళ వయో పరిమితి తప్పనిసరి కావడంతో తమ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్ధిక సాయం అందిస్తుండడంతో పాటు కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో విద్యార్ధినులు గ్రాడ్యుయేషన్‌లో చేరుతారు, తమ గ్రాడ్యూయేషన్ పూర్తి చేస్తారని జగన్ సర్కారు స్పష్టంచేసింది. ఈ చదువులతో పిల్లలు పేదరికం నుండి బయటపడి తమ తలరాతలు మార్చుకునే పరిస్ధితి వస్తుంది అని జగన్ అభిప్రాయపడ్డారు.


గత ప్రభుత్వంలో అరకొరగా కొన్ని వర్గాలకే ఆర్ధిక సాయం, అదీ సకాలంలో అందరికీ అందని వైనం, సాయం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన దైన్యం, అర్హులైన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ నెలల తరబడి జాప్యం చేసి 2018 అక్టోబర్‌ నుండి ఈ పథకాన్ని ఎత్తివేసిన దుస్ధితి నెలకొందని ఏపీ సర్కారు ఆరోపించింది. 2018 – 19 సంవత్సరంలో ఏకంగా 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టారని.. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాకా లంచాలకు, వివక్షకు తావు లేకుండా, కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగే దుస్ధితి లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్ధ ద్వారా అత్యంత పారదర్శకంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాల కింద అర్హులందరికీ సంతృప్తస్ధాయిలో లబ్ధి చేకూరుతోందని ఏపీ సర్కారు చెబుతోంది.


ఇది కూడా చదవండి : AP Farmers' Paddy Loss: ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు


ప్రతీ త్రైమాసికానికి ఒకసారి లబ్ధిదారుల ఎంపిక
వధూవరులు వివాహమైన 30 రోజుల లోపు తమ దగ్గర లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి, సంబంధిత అధికారులు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసి వివరాలను ధృవీకరించుకుని, ప్రతి ఏటా ఫిబ్రవరి, మే, ఆగష్టు, నవంబర్‌లలో ఆయా త్రైమాసికాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందిస్తారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వధువులందరికీ రూ. 1,50,000 వరకు ఆర్ధిక సాయం అందించనున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలోనే, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్ధిక సాయం చేస్తున్నట్టు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన ఆరు నెలల్లోనే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద మొత్తం 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు జమ చేసినట్టు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇది కూడా చదవండి : Cyclone Mocha News: ఏపీకి మరో గండం.. ముంచుకొస్తున్న 'మోచా' తుపాను ముప్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK