Ysr Kapu Nestham: కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాపునేస్తం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోంది. వైఎస్సార్ కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వైఎస్ జగన్(Ap cm ys jagan) ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వైఎస్సార్ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వరుసగా రెండవ ఏడాది కూడా కాపునేస్తం పథకాన్ని అమలు చేసింది. రాష్ట్రంలో కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3 లక్షల 27 వేల 244 మంది పేద మహిళలకు 490 కోట్ల ఆర్ధిక సహాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది. నిరుపేద కాపు మహిళలకు మేలు చేకూర్చేందుకు, ఆర్దికంగా నిలబడేందుకు వైఎస్సార్ కాపునేస్తం(Ysr kapu nestham)పథకాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.45-60 ఏళ్లలోపు కాపు మహిళలకు ఏడాదికి 15 వేల చొప్పున ఐదేళ్లలో 75 వేల రూపాయలు అందించనుంది. ప్రతి యేటా 15 వేల చొప్పున ఐదేళ్లకు 75 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందుతుంది. కాపు సామాజికవర్గంలోని మహిళల ఆర్దికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైఎస్ జగన్ చెప్పారు.రెండేళ్లలో వైఎస్సార్ కాపునేస్తం కింద 12 వేల 126 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం(Ap government). ఎక్కడా వివక్ష, అవినీతి లేకుండా వైఎస్సార్ కాపునేస్తం పథకం (Kapu nestham)అమలవుతోందని జగన్ స్పష్టం చేశారు. 


Also read: Eluru Corporation Counting: ఏలూరు కౌంటింగ్‌కు హైకోర్టు క్లియరెన్స్, ఈ నెల 25న ఓట్ల లెక్కింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook