YSRCP Manifesto: మరోసారి అధికారమే లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందరూ అనుకున్నట్టే ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే వాటిని విస్తరిస్తూ.. వాటి పరిధి పెంచారు. మరికొన్ని పథకాలను ప్రకటించారు. తన మేనిఫెస్టో ద్వారా మరోసారి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరూపించారు. 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయగా.. 2024 ఎన్నికలకు'సామాజిక భద్రత' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌


 


అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతానికి పైగా అమలు చేశామని చెబుతూనే ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో విడుదల చేసినట్టు జగన్ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 'సూపర్‌ సిక్స్‌' మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా


 


2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను రెండు ముక్కల్లో చెప్పవచ్చు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ.. వాటిని అప్‌డేట్‌ చేసింది. గతంలో ఇచ్చిన దాని కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని పేర్కొంది. సంక్షేమంపైనే మరోసారి వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. సంక్షేమ మంత్రమే గెలిపిస్తుందనే ధీమాలో జగన్‌ ఉన్నారు. వచ్చే ఐదేళ్లు ఇలాగే సంక్షేమం కొనసాగిస్తాం అనే సూత్రంతో వైఎస్సార్‌సీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.


కీలక హామీలు ఇవే..


  • వైఎస్సార్ చేయూత (45పై బడ్డ వయస్సు ఉన్న మహిళలకు మాత్రమే) రూ.75 వేల నుంచి రూ.లక్షా యాభై వేలకు పెంపు)

  • వైఎస్సార్ కాపు నేస్తం  రూ.60 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు పెంపు

  • ఓబీసీ నేస్తం రూ. లక్షా 20 వేలకు పెంపు

  • అమ్మఒడి రూ.15 వేల నుంచి 17 వేలకు పెంపు (75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే అమలు)

  • వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల కింద పొదుపు సంస్థలకు ఐదేళ్లకు రూ.3 లక్షలు

  • కల్యాణమస్తు.. షాదీ తోఫా కొనసాగింపు (పదో తరగతి తప్పక పాసవ్వాలి)

  • పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు

  • పట్టణాలలో ఉండే మధ్య తరగతి ప్రజల కోసం పట్టణ గృహ నిర్మాణ పథకం అమలు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయింపు.


పింఛన్‌లు


  • రూ.3 వేలు ఇస్తున్న పింఛన్‌ రూ. 3,500కు పెంపు. రెండు విడతల్లో ఈ పెంపు అమలు చేస్తారు. జనవరి 2028లో రూ.250, 2029లో రూ.250 చొప్పున రెండు విడతలుగా పెంపు.

  • రైతు భరోసా రూ.1,3500 నుంచి రూ.16 వేలకు పెంపు (ఇది ఏడాదిలో మూడు విడతలుగా ఇస్తారు. తొలి విడతలో రూ.8000, మలి విడతలో రూ.4000, చివరి విడతలో రూ.4000)

  • రైతులకు పంట రుణాలు కొనసాగుతాయి

  • వైఎస్సార్ బీమా కింద ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.

  • మత్స్యకార భరోసా, వాహన మిత్ర కొనసాగుతాయి

  • స్వయం ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహన మిత్రను సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వాళ్లకి కూడా విస్తరిస్తాం

  • ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా కల్పన.

  • లాయర్లకు లా నేస్తం కొనసాగింపు (కొత్త లాయర్లకు మూడేళ్లు నిబంధన)

  • చేనేత నేస్తం కొనసాగింపు

  • గతంలో మాదిరిగా అప్కో బకాయిలు చెల్లింపు.

  • స్కిల్ హబ్ ల కొనసాగింపు

  • 4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల పూర్తి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter