Dadi Veerabhadra rao: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదాస్పద ఉత్తర్వులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం పని చేయకుండా అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar) వ్యవహారశైలిపై వైసీపీ నేత దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ప్రతిరోజూ ఏదో ఒక వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం పని చేయకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల ( Municipal Elections)నేపధ్యంలో 2 లక్షల 60 వేల వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడం తప్పని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కమీషనర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా నియంత్రించాలని హైకోర్టు ( High court) ను కోరారు. 


వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని..ఫలితంగా రాష్ట్రంలో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని దాడి వీరభద్రరావు ( Dadi veerabhadra rao) వివరించారు. కమీషనర్ ఇచ్చే ఉత్తర్వులపై ప్రతిసారీ కోర్టుల్ని ఆశ్రయించడం వల్ల కోర్టు సమయం వృధా అవుతోందన్నారు. ఎన్నికల కమీషనర్ ఓ రాజకీయ పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబు నాయుడి (Chandrababu naidu) కైతే కుప్పం ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోలేదన్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలని..లేకపోతే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో పడుతుందని హెచ్చరించారు. 


Also read: Maritime India 2021: పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలెక్కువ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook