Ap municipal elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. అధికార పార్టీ హవా కనబర్చింది. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే దీనికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు జరుగుతున్న ఎన్నికల్లో(Municipal elections) కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. చాలావరకూ వార్డులు అధికారపార్టీకు అనుకూలంగా ఏకగ్రీవం కావడంతో ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala ramakrishna reddy)హర్షం వ్యక్తం చేశారు. ఊహించిందే జరిగిందని చెప్పారు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసమే దీనికి నిదర్శనమని సజ్జల తెలిపారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగున్నా ఇవే ఫలితాలుండేవని చెప్పారు. సుపరిపాలన అందిస్తే ప్రజల ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయని ఏకగ్రీవాల ఫలితాల ద్వారా స్పష్టమైందన్నారు. 


ఇక ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Sec Nimmagadda Ramesh kumar)విషయంలో చంద్రబాబు (Chandrababu) రోజుకో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్నటి వరకూ ధీరుడని పొగిడి..ఇప్పుడు మారిపోయాడని అంటున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల  సర్వీసులపై ఆంక్షలు పెట్టాలని ఎస్ఈసీ ఆంక్షలు విధించి కుట్ర పన్నినా..హైకోర్టు ఆ కేసు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ అధికార దుర్వినియోగం చేసి  మళ్లీ నామినేషన్ వేయాలని చెప్పినా ఎవరూ వేయడానికి ముందుకు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాల్ని మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై ఈసీకు ఫిర్యాదు చేస్తామన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. 


2014 మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు  2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు, ఇంటికో ఉద్యోగం చెప్పి..తరువాత మర్చిపోయారని గుర్తు చేశారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోను తీసేసిన ఘనుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


Also read: AP Municpal elections 2021: మున్సిపల్ పోరులో ముగిసిన నామినేషన్ల పర్వం, ఏకగ్రీవాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook