Sajjala Ramakrishna reddy: స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిన్నటి వరకూ ఓ మాట..ఇప్పుడు మరో మాట చెబుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ వ్యాక్సిన్, కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో నాడు ఎన్నికలు వాయిదా వేయాలని కోరితే పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna reddy)స్పష్టం చేశారు. అదే సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయమంటే మాత్రం వ్యాక్సినేషన్ సాకు చూపిస్తున్నారని మండిపడ్డారు. తమవరకైతే ఆరు రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి..కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. తదుపరి వచ్చే ఎన్నికల కమీషనర్‌ను కూడా ఇదే కోరనున్నట్టు చెప్పారు. 


కోవిడ్ వైరస్ మహమ్మారి విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోటిమందికి వ్యాక్సినేషన్ (Vaccination) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగానే చాలా పోరాడామని..చంద్రబాబు మాత్రం హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకు ఒప్పుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన పనికి ఆరోజే హోదా డిమాండ్ సగం చచ్చిపోయిందన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలా పోరాడుతామని తెలిపారు. చంద్రబాబులా దొంగాట ఆడకుండా నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని(Zptc-Mptc Elections)ఇప్పుడు నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్(Nimmagadda Ramesh kumar)తెలిపారు. తన పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తుందని..తరువాత వచ్చే ఎన్నికల కమీషనర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. 


Also read: TTD Kalyanamasthu: టీటీడీ శుభవార్త, త్వరలో మళ్లీ కళ్యాణమస్తు కార్యక్రమం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook