TTD Kalyanamasthu: టీటీడీ శుభవార్త, త్వరలో మళ్లీ కళ్యాణమస్తు కార్యక్రమం

TTD Kalyanamasthu: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందిస్తోంది. పదేళ్ల నుంచి నిలిచిపోయిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనుంది. శ్రీవారి సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు బంగారం బహుమతిగా అందించనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2021, 11:30 AM IST
TTD Kalyanamasthu: టీటీడీ శుభవార్త, త్వరలో మళ్లీ కళ్యాణమస్తు కార్యక్రమం

TTD Kalyanamasthu: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందిస్తోంది. పదేళ్ల నుంచి నిలిచిపోయిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించనుంది. శ్రీవారి సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు బంగారం బహుమతిగా అందించనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లో శ్రీవారి సన్నిధిలో హిందూవులు వివాహం చేసుకునేలా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajasekhar reddy) టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగేది. పెద్దఎత్తున జంటలు వివాహం చేసుకునేవారు. 2007 నుంచి 2011 వరకూ ఏడాదికి రెండుసార్లు నిరాటంకంగా కొనసాగిన కార్యక్రమం అనంతరం నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పట్లో ఈ కార్యక్రమం ప్రకారం వధూవరులకు టీటీడీ తరపున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టు అందించడమే కాకుండా 50 మంది బంధువులకు భోజనాలు అందించేవారు. 

పదేళ్లకాలంగా నిలిచిపోయిన కళ్యాణమస్తు( Kalyanamasthu program) కార్రక్రమాన్ని మళ్లీ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైంది. మే 28, అక్టోబర్ 30, నవంబర్ 17 తేదీల్లో కళ్యాణమస్తు కారక్రమం జరగనుందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు బహమతిగా అందించనున్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేస్తూ..పవిత్ర లగ్నపత్రికను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే దీనికోసం టీటీడీ ట్రెజరీలో సిద్ధంగా ఉన్న 20 వేల తాళిబొట్టను వినియోగించనున్నారు. 

Also read: Amaravati land scam: సీఐడీ చేతికి కీలక ఆధారాలు, సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News