YCP Leaders: ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధుల వ్యవహారాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఇటీవల ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ అశ్లీల నృత్యాలు కనిపించడంపై కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా ఒకే రోజు ఇద్దరు ప్రజాప్రతినిధులు వార్తల్లో నిలిచారు.
ఆ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాసలీల వీడియో లీక్‌ అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. సోషల్‌ మీడియాలో మాధవ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌గా కనిపించారు. దీనిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంపీ తీరును ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు తప్పుపడుతున్నారు.


[[{"fid":"240317","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రజాప్రతినిధిగా ఉన్న నేత ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం సైతం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరో వీడియో వైరల్‌గా మారింది. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు కనిపించాయి. 


స్థానిక గడియార స్తంభం కూడలిలోని ప్రధాన రోడ్డుపై వేదికను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో వీటిని నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అర్థరాత్రి సమయంలో ఇలా చేయడం ఏంటని స్థానికులు అంటున్నారు. ఇలా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నామన్న ఇదితోనే ఇలా చేస్తున్నారని స్థానికులు ఫైర్ అవుతున్నారు.


[[{"fid":"240318","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Also read:Mangal Gochar 2022: వృషభ రాశిలోకి అంగారక గ్రహం సంచారం.. ఆగస్టు 10 తరువాత ఈ రాశుల వారికి అన్ని శుభ పరిణామాలే..!


Also read:MP Gorantla Madhav Live Updates: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో లీక్.. పార్లమెంట్ లో రచ్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook