వరుసగా మహిళలతో మాట్లాడుతున్న రాజాకీయ నాయకుల ఆడియో టేపుల లీకులు ఏపీలో (Andhra Pradesh) సంచలనం శృష్టిస్తున్నాయి. మొన్న పృథ్వీ రాజ్ (Prudhvi Raj) ఆడియో,  ఇటీవల ఓ మహిళతో మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు (YSRCP Ambati Rambabu) అడ్డంగా బుక్కవగా, ఇపుడు మంత్రి అవంతి శ్రీనివాసరావు (Ap Minister Avanthi Arinivas) వంతు రానే వచ్చింది. ఇపుడు సోషల్ మీడియోలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలల పేరిట ఒక ఆడియో టేప్ చక్కర్లు కొడుతుంది. ఒక మహిళతో సరసాలాడుతున్నట్టు ఉన్న ఆడియోలో ఉంది వైసీపి పార్టీ (YSRCP) మంత్రి అవంతి శ్రీనివాస్ రావు అని సోషల్ మీడియాలో ప్రాచారం జరుగురింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఆ ఆడియో టేప్ లో ఏం ఉండదంటే??
"పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. నా మాట విను... అన్ని రకాలుగా బాగుంటుంది... ఓ అరగంటలో పంపిస్తా.. నాతో.. ఓ అరగంట కూడా గడపలేవా..?? నీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంది.. చెప్పిన మాట విను...." అంటూ మహిళతో సరసాలాడుతున్నట్టు ఉన్న ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 




Also Read: 'RRR' movie update: అభిమానులకు మళ్లీ నిరాశే.. వాయిదా పడ్డ 'RRR' రిలీజ్ డేట్..??


ఇది మంత్రి అవంతి శ్రీనివాస్ దే అని సోషల్ మీడియా లో వైరల్ అవగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం ఆయింది. విషయం తెలియగానే గురుచారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. 


తన రాజకీయ ఎదుగుదల చూసి కొందారు ఓర్వలేకే ఇలా నకిలీ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వదిలేసారని, వైకాపా మహిళల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుందన్న ఉద్దేశంతోనే తనపై ఇలాంటి వాటిల్లో ఇరికిస్తున్నారని మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. తాను దేవుడిని నమ్మే వాడినని , ఇబ్బంది పెడితే వాళ్లే తిరిగి ఇబ్బంది పడక తప్పదని పేర్కొన్నారు. ఈ ఆడియో టేప్ గురించి తెలియగానే సైబర్ క్రైం పోలీసలకు ఫిర్యాదు చేసానని , దర్యాప్తు జరుగుతుందని, నిందితులేవరో పోలీసులే తేలుస్తారని మంత్రి చెప్పారు. 
Also Read: Varalakshmi Vratham 2021: వరలక్ష్మి వ్రతం...ఇంటిల్లిపాదికి శుభకరం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook