'RRR' movie update:కరోనా (Corona) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ధన, ప్రాణ నష్టాలను కలిగింది. అన్ని రకాల రంగాల్లో కరోనా ప్రభావం చూపగా, సినిమా ఇండస్ట్రీకి తీరని నష్టం కలిగించిది. కరోనా ఫస్ట్ వేవ్ (First Wave), సెకండ్ వేవ్ (Secong Wave) ముగిసిన, కొన్ని థియేటర్లు తెరచుకున్నప్పటికీ పూర్తిగా థియేటర్లు తెరవని కారణంగా చాలా సినిమాలు విడుదలను తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. ఇపుడు అరకొర చిన్న చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ, పాన్ ఇండియా సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూనే వస్తున్నాయి..
ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), రామ్‌చరణ్ (Ramcharan)ప్రధాన పాత్రలో రాజమౌళి (Rajampuli) దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా (Pan India) చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(రౌద్రం,రణం, రుధిరం). ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే... ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా మళ్లి వాయిదా పడిందనే విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood Film Industry) హాట్ టాపిక్ గా మారింది.
Also Read: పిచ్చి పీక్స్.. ఆర్జీవీతో అషురెడ్డి.. వైరలవుతున్న వీడియో క్లిప్!
ఈ సినిమా పై ఎన్ని అంచనాలున్నాయో అందరికి తెలిసిందే. కానీ ఇప్పటికీ ఈ సినిమా రెండు సార్లు విడదల (2020 జూలై 30, 2021 జనవరి 08) తేదీలను మార్చారు. చివరకి ఈ ఏడాది అక్టోబరు 13న దసరా కానుకుగా థియేటర్లో సందడి చేస్తుందని భావిస్తున్న మళ్లి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.
సేకంగ్ వేవ్ (Second Wave) కారణంగా పూర్తీ స్థాయిలో సినిమా థియేటర్లు తెరచుకొని కారణంగా, ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుల చేసే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై సినిమా నిర్మాణ సంస్థ, యాజమాన్యం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.
ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan) ఉక్రెయిన్ (Ukraine) లో షూటింగ్ పూర్తి చేస్తుకొని హైదరాబాద్ (Hyerabad) కు చేసుకున్నారు. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా (Komaram bheem), రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 14 భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందన్న సంగతి అందరకి తెలిసిందే.
Also Read: BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ల కొత్త జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook