YSRCP MLA Dharmana prasada rao says don't take garbage if not paid the tax : ఏపీలో ఇప్పుడు చెత్త సేకరణ పన్ను హాట్ టాపిక్‌గా మారింది. చెత్త సేకరణ పన్ను ఎందుకంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, (YSRCP MLA) మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana prasada rao) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెత్త సేకరణ పన్ను (Garbage tax) కట్టకుంటే వారి ఇళ్లకు సంబంధించిన చెత్త తీసుకెళ్లకూడదని, పైగా ఆ చెత్తను వారి ఇళ్ల ముందే పోయాలంటూ ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం సిటీలో తాగు నీటి పథకానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.


అయినా రూ.100 చెత్త పన్ను వసూలు చేస్తే దేనికి రాద్ధాంతం చేస్తున్నారంటూ ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasad) ప్రశ్నించారు. ఇందులో పెద్ద విషయం ఏముందని అడిగారు. గవర్నమెంట్ చేయాల్సింది అంతా చేస్తోంది.. చెత్త పన్ను(Tax) కట్టకుంటే వారి చెత్త తీసుకెళ్లం అని తేల్చి చెప్పారు ధర్మాన ప్రసాదరావు. 


అంతేకాదు పన్ను చెల్లించని వారి ఇంటి ఎదుటే చెత్త పోసేయాలి అన్నారు ఆయన. ఇలాంటి ఘటనలు వాళ్లు అనుభవిస్తేనే తెలుస్తుందని అని చెప్పుకొచ్చారు. గవర్నమెంట్ స్కీమ్స్‌కు (Government Schemes‌) డబ్బులు పంచాలి.. మనమేమో పన్నులు కట్టం అంటే ఎలా సరిపోతుందంటూ ప్రశ్నించారు.



 


Also Read : JP Nadda Rally: హైదరాబాద్ లో హైటెన్షన్.. శంషాబాద్ చేరుకున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా


సచివాలయ సిబ్బంది, అధికారులు అందరితో చెత్త పన్ను కట్టించేలా పని చేయాలంటూ ధర్మాన ప్రసాదరావు సూచించారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో (AP) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో (Social media) కూడా ఈ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 


Also Read : Dangerous Snake Video: భయంకరమైన వీడియో- యువతిని పదేపదే కాటు వేసిన సర్పం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి