Threat to Pattabhi: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. పట్టాభికి ప్రాణహాని ఉందంటూ సంచలనం రేపారు. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై(Ap cm ys jagan)టీడీపీ నేత పట్టాభి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బూతులు కూడా తిట్టిన పరిస్థితి. అనంతరం ఆ టీడీపీ నేత అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడీ టీడీపీ నేత పట్టాభికి సంబంధించి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత పట్టాభి(TDP Leader Pattabhi) ప్రాణాలకు హాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)నుంచని మరో వివాదం రేపారు. రాజకీయ లబ్దికై పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరితతత్వం చంద్రబాబుదని ద్వారంపూడి(Dwarampudi Chandrasekhar reddy)ఆరోపించారు.ఈ విషయమై పట్టాభి కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah)అపాయింట్‌మెంట్ కోరడంపై స్పందించారు. ఒకప్పుడు అదే అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయించిన చంద్రబాబు..ఇప్పుడు అపాయింట్‌మెంట్ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 


Also read: Kakinada New Mayor: అధికారపార్టీ ఖాతాలో మరో మేయర్, కాకినాడ కొత్త మేయర్‌గా సుంకర శివప్రసన్న


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook