MLA Kotamreddy Sridhar Reddy meets Amaravati farmers: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులను (Amaravati farmers) కలవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి రైతులను కలవడమే కాదు.. వారికి సంఘీభావం కూడా ప్రకటించారు. ఓవైపు వైసీపీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రపై విమర్శలు గుప్పిస్తున్న వేళ... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారిని కలిసి సంఘీభావం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండుతో అక్కడి రైతులు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట పాదయాత్ర (Amaravati farmers padayatra) చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి తిరుమల వరకు సాగే ఈ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు (Nellore) చేరుకుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రైతులు బస చేస్తున్న హోటల్‌ వద్దకు వెళ్లారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఏ అవసరమొచ్చినా తనకు చెప్పాలని... తప్పకుండా సహకరిస్తానని మాటిచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు 'జై అమరావతి' అనాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కోరారు. అందుకు ఆయన సున్నితంగా నిరాకరించారు. 


ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అమరావతి పట్ల వైసీపీ ప్రభుత్వ స్టాండ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం... ఇప్పుడు దాని స్థానంలో మరింత మెరుగైన బిల్లును తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. నిజానికి వైసీపీ (YSRCP) ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న వేళ... అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తారేమోనన్న చర్చ జరిగింది. కానీ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని సీఎం జగన్ చెప్పకనే చెప్పేశారు. దీంతో అమరావతి రైతులకు భంగపాటు తప్పలేదు. ఇక ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy Ramachandra Reddy) అమరావతి రైతుల పాదయాత్రను పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్రగా విమర్శించిన సంగతి తెలిసిందే. అదేమైనా లక్షల మందితో సాగుతోందా అని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ పలువురు వైసీపీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రపై విమర్శలు చేశారు. మొత్తంగా అమరావతి రైతుల పాదయాత్ర పట్ల వైసీపీ వైఖరి సుస్పష్టం. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీ లైన్‌కు భిన్నంగా అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ లేదా ఇతర వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read:డాలర్ శేషాద్రి మరణంపై ముఖ్యమంత్రి జగన్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిల సంతాపం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook