రణరంగమైన చినకాకాని..
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అగ్గి రాజేస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములను త్యాగం చేసిన అన్నదాతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. దాదాపు 20 రోజుల కిందట మొదలు పెట్టిన అమరావతి ఉద్యమం క్రమక్రమంగా బలపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అగ్గి రాజేస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములను త్యాగం చేసిన అన్నదాతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. దాదాపు 20 రోజుల కిందట మొదలు పెట్టిన అమరావతి ఉద్యమం క్రమక్రమంగా బలపడుతోంది. ఎన్ని కమిటీలు నివేదికలు ఇచ్చినా .. తాము మాత్రం అమరావతి తరలింపునకు ఒప్పుకునే పరిస్థితి లేదని అన్నదాతలు తేల్చి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ .. రైతులు చేపట్టిన ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. ఇవాళ ఉద్యమ ఆందోళన సందర్భంగా వాతావరణం అంతా రచ్చ రచ్చగా మారింది.
వైసీపీ ఎమ్మెల్యే కారు ధ్వంసం
గుంటూరు జిల్లా చినకాకాని రణరంగంగా మారిపోయింది. ఆందోళన బాట పట్టిన రైతుల ఉద్యమం హింసాత్మకంగా సాగింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై దాడికి పాల్పడ్డారు. ఆయన కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో ఆయన కారు మొత్తం ధ్వంసమైపోయింది. అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై 16పై జరిగింది.
[[{"fid":"180963","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]