YSRCP MLC WARNING: అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతా.. వైసీపీ ఎమ్మెల్సీ ఓపెన్ వార్నింగ్
YSRCP MLC WARNING:మహానాడు సక్సెస్ జోష్ తో ఉన్న టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు.
YSRCP MLC WARNING: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ఒంగోలులో మహానాడును ఘనంగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. మహానాడు వేదిక నుంచే వచ్చే ఎన్నికలకు శంఖారావం మోగించింది. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇతర టీడీపీ నేతలు కూడా మహానాడు వేదికగా జగన్ ను వ్యక్తిగత విమర్శలు చేశారు. అటు టీడీపీ మహానాడుకు పోటీగా అధికార వైసీపీ సామాజిన న్యాయ భేరీ పేరుతో జనంలోకి వెళ్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు, నేతలు బస్సు యాత్ర చేశారు. టీడీపీ నేతలను ఆరోపణలకు కౌంటరిస్తూ.. తమ ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. అధికార, విపక్షాల పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
మహానాడు సక్సెస్ జోష్ తో ఉన్న టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. అచ్చెన్నాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గురించి మాట్లాడితే టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడిని గుడ్డలు ఊడదీసి కొడతా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిని నేను అలా కొట్టకపోతే.. తాను దువ్వాడ శ్రీనివాసే కాదంటూ సవాల్ చేశారు. అచ్చెన్నాయుడిని కొట్టడానికి తనకు ఒక్క నిమిషం సమయం సరిపోతుందన్నారు దువ్వాడ శ్రీనివాస్.
తెలుగుదేశం పార్టీకి మరొకరు దిక్కులేకే అంబోతులా ఉన్న అచ్చెన్నాయుడిని ఏపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మహానాడు వేదికపై జగన్ ను ఉద్దేశిస్తూ అచ్చెన్నాయుడు మాట్లాడిన ప్రతి మాటకు బదులిస్తానని దువ్వాడ తేల్చిచెప్పారు. అచ్చెన్నాయుడు ఇప్పటికైనా పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే ఆహుతి సినిమాలో విలన్ ను హీరో రోడ్డుపై ఊడ్చుకెళుతూ కొట్టినట్లు తాను అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతానని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఆత్మహుతి దళం సభ్యుడిగా మారుతానని దువ్వాడ శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు.
READ ALSO: HDFC BANK: మీకు HDFCలో అకౌంట్ ఉందా.. వెంటనే ఖాతా చెక్ చేసుకోండి.. కోట్ల రూపాయలు జమ కావొచ్చు?
READ ALSO: IPL 2022 Final: సరికొత్త రికార్డు నెలకొల్పిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook