HDFC BANK: మీకు HDFCలో అకౌంట్ ఉందా.. వెంటనే ఖాతా చెక్ చేసుకోండి.. కోట్ల రూపాయలు జమ కావొచ్చు?

HDFC BANK: మీకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే వెంటనే మీ ఖాతాను చెక్ చేసుకోండి.. మీ అకౌంట్ లో కోట్లాది  రూపాయలు జమ అయ్యాయోమో చూసుకోండి.. ఎందుకంటే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు జమ అవుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఆదివారం చెన్నైలోని ఓ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు జమ అయ్యాయి.

Written by - Srisailam | Last Updated : May 30, 2022, 12:16 PM IST
  • HDFC ఖాతాదారులకు డబ్బే డబ్బు
  • అకౌంట్లకు జమవుతున్న కోట్ల రూపాయలు
  • నగదు చూసి షాకవుతున్న కస్టమర్లు
 HDFC BANK: మీకు HDFCలో అకౌంట్ ఉందా.. వెంటనే ఖాతా చెక్ చేసుకోండి.. కోట్ల రూపాయలు జమ కావొచ్చు?

HDFC BANK: మీకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే వెంటనే మీ ఖాతాను చెక్ చేసుకోండి.. మీ అకౌంట్ లో కోట్లాది  రూపాయలు జమ అయ్యాయోమో చూసుకోండి.. ఎందుకంటే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు జమ అవుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. ఆదివారం చెన్నైలోని ఓ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు జమ అయ్యాయి. ఓ ఖాతాదారుడి అకౌంట్ కు ఏకంగా 13 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది.

వికారాబాద్ లోని  HDFC  బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ అయ్యాయి. వ్యాపారి వెంకట్‌రెడ్డి అకౌంట్‌లో అకంగా రూ. 18.52 కోట్లు వచ్చి పడ్డాయి. మరికొందరు ఖాతాల్లోకి నగదు జమ అయింది. దాదాపు వంద మంది అకౌంట్లకు ఇలా అప్పనంగా డబ్బులు వచ్చి పడ్డాయని తెలుస్తోంది. తన అకౌంట్ లో 18. 52 కోట్ల రూపాయలు జమ కావడంతో వ్యాపారి వెంకట్ రెడ్డి షాకయ్యాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఖాతాలను చెక్ చేసిన బ్యాంక్ అధికారులు.. దాదాపు వంద మంది ఖాతాదారుల అకౌంట్లలో జమలు జమ అయ్యాయని గుర్తించారు. నగదు జమ అయిన బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు అధికారులు. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని చెప్పారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ ను ఇన్ స్టాల్ చేసే క్రమంలోనే ఇలా జరిగిందంటున్నారు అధికారులు

చెన్నైలోని త్యాగరాయ నగర్ హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తమ అకౌంట్లలోకి  ఒకేసారి రూ.13 కోట్లు జమ అయినట్లు మెసేజ్ లు రావడంతో కస్టమర్లు షాకయ్యారు. వందమందికి రూ. 13 కోట్లు జమ కాగా.. మరికొందరి ఖాతాలకు 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు జమ అయ్యాయి. టినగర్‌ బ్యాంక్‌లోసాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. దీని వల్ల తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్ తో బ్యాంకుకు సంబంధించిన వందమంది ఖాతాల్లో 13 కోట్ల రూపాయలు జమ అయ్యాయని గుర్తించారు. సమస్యను  గుర్తించిన బ్యాంకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. డబ్బులు జమ అయిన  ఖాతాలను ఫ్రీజ్ చేశారు. డబ్బులను రికవరీ చేస్తున్నారు. అయితే  కొందరు కస్టమర్లు మాత్రం తమ ఖాతాల్లో జమ అయిన డబ్బులను విత్ డ్రా చేసుకుని ఖర్చు కూడా చేశారని తెలుస్తోంది.

READ ALSO:IPL 2022 Final: సరికొత్త రికార్డు నెలకొల్పిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యాచ్!

READ ALSO: Viral News: ఫోటోగ్రాఫర్ లేడనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకున్న వధువు.. బిత్తరపోయిన వరుడు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News