స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖపట్నానికి పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని కూడా స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) పంచాయితీ ఓ వైపు హైకోర్టు ( High court ) విచారణలో ఉంది. మరోవైపు ఎన్నికల విషయంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ( ycp mp vijay sai reddy ) స్పష్టత ఇచ్చారు. కరోనా వైరస్ ( Corona virus ) పరిస్థితులు చక్కబడిన తరువాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని విజయసాయి రెడ్డి తెలిపారు. మూడు రాజధానుల విషయంలో ఎవరితో చర్చించాలో వారితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. చంద్రబాబు ( chandrababu ) జీవితం మొత్తం కుట్రలమయమన్నారు. 


తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ తమ వాదం కోసం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారని..చంద్రబాబుకు ఆ ధైర్యముందా అని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అమరావతిలో తన భూముల ధరలు తగ్గిపోతాయనేది చంద్రబాబు భయమన్నారు.


Also read; AP: ఏబీ వెంకటేశ్వరరావుపై మరిన్ని అభియోగాలు..చర్యలు తప్పవా