YS Sharmila:  తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల జోరుగా జనంలో తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పాదయాత్ర వంద రోజులు దాటింది. 13 వందల కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల యాత్ర ఖమ్మం జిల్లాలో సాగుతోంది. ఖమ్మం జిల్లా యాత్రలో భాగంగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచే ఆమె ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఆ వాదనలను నిజం చేస్తూ తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తనకు అనుకూలంగా ఉంటుందని భావించిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేలకొండపల్లిలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో షర్మిల ఈ ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సాఆర్ కు వేలాది మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. వైఎస్ ఫోటోతోనే ఎన్నికల్లో కొందరు నేతలు గెలుస్తున్నారని చెప్పారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. వైఎస్ఆర్ పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందన్నారు షర్మిల. వైఎస్ఆర్ పై  ప్రజల్లో ఉన్న అభిమానమే తన పార్టీకి ఆస్తి అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలన్నారు. వైఎస్సార్ పార్టీ పతాకం పాలేరు గడ్డ పై ఎగరాలన్నారు షర్మిల. అత్యధిక మెజారిటీ కోసం పని చేయాలన్నారు. చరిత్ర లో  ఎరగని మెజారిటీ కోసం పని చేద్దామన్నారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పాలేరు నియోజక వర్గం ఒక దిశా, నిర్దేశం కావాలన్నారు షర్మిల.


పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తానని ప్రకటించడంతో.. ఆ సీటునే ఎందుకు ఎంచుకుందన్న చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది. ఏపీకి చెందిన వారు ఎక్కువే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. వైరా, అశ్వారావుపేట, పినపాక నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాష్ట్రమంతా వైసీపీ పోటీ చేసినా.. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే గెలిచారు. వైఎస్సాఆర్ ఫోటోతోనే వాళ్లంతా గెలిచారని టాక్. అందుకే ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని షర్మిల డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.


ఇక పాలేరు ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే జనరల్. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం. వీటిలో ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి పట్టుంది. ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి పవ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. కొత్తగూడెంలో బీసీలు ఎక్కువ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరావు గెలిచారు. పాలేరులో మాత్రం రెడ్డిలదే ఆధిపత్యం. పాలేరు నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టినా గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరారవు ఓడిపోవడానికి సామాజిక ఈక్వేషన్స్ కారణమని చెబుతారు. ఇవన్ని పరిశీలించాకే పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారని తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ అభిమానులు భారీగా ఉన్నారని అంచనా వేస్తున్న షర్మిల.. తాను పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారని అంటున్నారు.


Read also: Chandra Babu on CM Jagan: రాజకీయ కక్షతోనే చీకటి దాడులు..సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం..!


Read also: Konda Film: రేవంత్ రెడ్డి పులి.. దయాకర్ రావుకు డైపర్లే! తీన్మార్ పంచ్ లతో కొండా డాటర్ పొలిటికల్ ఎంట్రీ?    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook