Chandra Babu on CM Jagan: రాజకీయ కక్షతోనే చీకటి దాడులు..సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం..!

Chandra Babu on CM Jagan: ఏపీలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత అంశం తీవ్ర దుమారం రేపుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 19, 2022, 02:54 PM IST
  • నర్సీంపట్నంలో ఉద్రిక్తత
  • అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత
  • భారీగా చేరుకుంటున్న టీడీపీ నేతలు
Chandra Babu on CM Jagan: రాజకీయ కక్షతోనే చీకటి దాడులు..సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం..!

Chandra Babu on CM Jagan: ఏపీలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ స్థలంలో గోడను నిర్మించారంటూ అధికారులు తొలగించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటని అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంతో నర్సీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత ముమ్మాటికీ కక్ష సాధింపేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన బలమైన బీసీ నేతనే టార్గెట్‌ చేస్తూ సీఎం జగన్‌ ..అక్రమ కేసులు, అరెస్ట్‌లు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చోడవరం మినీ మహానాడు వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడినందుకే ఇలా చీకటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అయ్యనపాత్రుడు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు వారి దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. అయ్యన్నకు టీడీపీ అండగా ఉందని స్పష్టం చేశారు. 

మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే ఇంటి గోడను తెల్లవారుజామున అధికారులు కూల్చివేశారు. ఈవ్యవహారంలో అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అయ్యన్నపాత్రుడు ఇంటి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. వారికి సంఘీభావం చెబుతున్నారు. 

Also read:Warning Call: పిస్టల్ తీసుకుని వచ్చి మీ ఇంట్లోనే కాల్చి పడేస్త.. హైదరాబాద్ VHP నేతకు బెదిరింపు కాల్  

Also read:Rajnath Singh Review on Agnipath: అగ్నిపథ్‌పై రాజ్‌నాథ్‌ సింగ్ కీలక రివ్యూ..మరిన్ని తాయిలాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News