Best Selling SUV: అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 3 ఎస్‌యూవీ కార్లు ఇవే.. హ్యుందాయ్ క్రెటా మాత్రం లేదు!
2022 Best Selling SUV Cars in India. డిసెంబర్ 2022లో దేశంలో అత్యధికంగా విక్రయించబడిన టాప్ 10 వాహనాలలో 4 మోడల్‌లు ఎస్‌యూవీలు ఉన్నాయి.
2022 Best Selling SUV Cars in India: భారత మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ప్రజలు ఎస్‌యూవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఎస్‌యూవీల అమ్మకాలు పెరగడానికి కారణం ధర, మైలేజ్. డిసెంబర్ 2022లో దేశంలో అత్యధికంగా విక్రయించబడిన టాప్ 10 వాహనాలలో 4 మోడల్‌లు ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి. అయితే క్రెటా టాప్-3 ఎస్‌యూవీలలో (సేల్స్ పరంగా) చోటు దక్కించుకోలేకపోయింది.
Tata Nexon:
డిసెంబర్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ కారు టాటా నెక్సన్. ఈ కారు 12053 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే 2021 సంవత్సరం డిసెంబర్ నెలతో పోల్చినట్లయితే.. ఈసారి తక్కువే. 2021లో 12899 యూనిట్ల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించింది. 2021 కంటే 2022లో 846 యూనిట్లు తక్కువగా విక్రయించింది. ఈసారి 6.56 శాతం సేల్స్ పడిపోయాయి.
Maruti Brezza:
నెక్సన్ తర్వాత రెండవ స్థానంలో మారుతి సుజుకి బ్రెజా ఉంది. డిసెంబర్ 2022 నెలలో మొత్తం 11200 యూనిట్ల బ్రెజా కార్లు విక్రయించబడ్డాయి. డిసెంబర్ 2021లో కంపెనీ 9531 యూనిట్ల బ్రెజాలు అమ్మింది. అంటే వార్షిక ప్రాతిపదికన మరో 1669 యూనిట్లను ఎక్కువ విక్రయించింది. విక్రయాలలో 17.51 శాతం పెరుగుదల ఉంది.
Tata Punch:
డిసెంబర్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో టాటా పంచ్ మూడో స్థానంలో ఉంది. డిసెంబర్ 2022లో టాటా పంచ్ మొత్తం 10586 యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 2021లో మొత్తం 8008 యూనిట్ల పంచ్‌లు విక్రయించబడ్డాయి. అంటే వార్షిక ప్రాతిపదికన 2578 ఎక్కువ యూనిట్ల పంచ్‌లను విక్రయించింది. అమ్మకాలు 32.19 శాతం పెరిగాయి.
Also Read: Mahindra Cheapest SUV: మహీంద్రా చౌకైన కారు.. 6 మంది కూర్చోవచ్చు! ధర 6 లక్షలు మాత్రమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.