2023 Best Mileage Bikes in India: ఇండియన్ మార్కెట్‌లో యువత కార్లతో పాటు బైక్‌లపై కూడా మనసు పారేసుకుంటారు. యువత మాత్రమే కాదు దేశంలో చాలా మంది సామాన్య ప్రజలు ద్విచక్ర వాహనాలను ఉపయోగించటానికి ఇష్టపడతారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కవ మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనడానికి చూస్తుంటారు. ఈ కారణంగానే ఎక్కువ మైలేజీని ఇచ్చే బైకులకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు బెస్ట్ మైలేజీని ఇచ్చే 4 బైక్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TVS Sport Mileage:
టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఇండియన్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతోంది. ఈ బైక్‌లో 109.7cc BS6 ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 8.18 bhp శక్తిని మరియు 8.7 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్‌ మార్కెట్‌లో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఏడు రంగులలో ఈ బైక్ వస్తుంది. ఇందులో 10 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,025 నుంచి మొదలై రూ. 67,530 వరకు ఉంటుంది. ఈ బైక్ 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Hero HF Deluxe Mileage:
హీరో ఎచ్ఎఫ్ డీలక్స్ 97.2cc BS6 ఇంజన్‌తో వస్తుంది. ఇది 7.91bhp శక్తిని మరియు 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్‌ 5 వేరియంట్లు మరియు 10 రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 9.1 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 55,022 నుంచి రూ. 67178 వరకు ఉంటుంది. ఈ బైక్ 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Honda SP 125 Mileage:
హోండా ఎస్పీ 125 బైక్ 124cc BS6 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ 10.72bhp పవర్ మరియు 10.9NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో కలిపి బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో మరియు 5 రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ 11 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగి ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 83,088 నుంచి రూ.  69702 వరకు ఉంటుంది. ఈ బైక్ 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Honda Livo Mileage:
భారత మార్కెట్లో రెండు వేరియంట్‌లు మరియు 4 రంగులలో హోండా లివోను కనుగొనవచ్చు. ఈ బైక్ 109.51cc BS6 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8.67bhp శక్తిని మరియు 9.30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు మరియు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ బైక్‌లో 9 లీటర్ల ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.  75,659. హోండా లివో 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Also Read: Shani Gochar 2023: ఈ 5 రాశుల వారికి వచ్చే 25 నెలలు అదృష్టమే.. ప్రతి పనిలో విజయం! ధనవంతులు అవుతారు  


Also Read: PBKS vs LSG: లక్నోదే బ్యాటింగ్.. గబ్బర్ సింగ్ ఈజ్‌ బ్యాక్‌! తుది జట్లు ఇవే  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.