Here is Top 4 Cheapest Cars List in india: భారతీయ కార్ మార్కెట్‌ రోజురోజుకి విస్తరిస్తోంది. సెడాన్‌లు మరియు లగ్జరీ కార్ల నుంచి ఎస్‌యూవీల వరకు ప్రతి విభాగంలో విభిన్న ఎంపికలతో కూడిన విస్తృత శ్రేణి వాహనాలు ఉన్నాయి. అయినప్పటికీ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.  హ్యాచ్‌బ్యాక్‌ కార్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న జాబితాలో మూడో స్థానంలో ఉన్నాయి. దేశంలో కార్ల కొనుగోలుదారులు కూడా చౌకైన వాహనాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల లోపు ఉన్న చౌకైన 4 కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. విశేషమేమిటంటే ఈ కార్లు మంచి మైలేజీని కూడా ఇస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Eeco:
ఇది దేశంలోనే అత్యంత చవకైన 7 సీట్ల కారు మారుతి ఎకో. దీనిని వ్యాన్ అని కూడా పిలుస్తారు. దీని ధర రూ.5.27 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 72.4 బిహెచ్‌పి పవర్ మరియు 98 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో CNG ఎంపిక కూడా ఉంది. దీని మైలేజ్ 20KM కంటే ఎక్కువ.


Renault Kwid:
రెనాల్ట్ క్విడ్ కారు మారుతి ఆల్టోకు పోటీగా ఉంది. క్విడ్ ప్రారంభ ధర రూ.4.70 లక్షలు. క్విడ్‌లో రెండు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఎంపిక 0.8L 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కాగా.. రెండవది 1.0L 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు AMT ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది.


Maruti Alto K10:
మారుతీ ఆల్టో కె10 ప్రస్తుతం దేశంలోనే అత్యంత చవకైన కారు. ఈ కారు ధర రూ.3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్‌లలో (Std, Lxi, Vxi, Vxi+) అందుబాటులో ఉంది. ఆల్టో కె10 కారు 214 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 67bhp శక్తిని మరియు 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Maruti Suzuki S Presso:
మారుతి సుజుకి S-ప్రెస్సో K సిరీస్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 66 Bhp శక్తిని మరియు 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది చూడటానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఇందులో చాలా బూట్ స్పేస్‌ ఇవ్వబడింది. ఈ కారులో CNG ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. CNGతో S-ప్రెస్సో 32KM కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.


Also Read: Eesha Rebba Pics: బ్లాక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా.. మెరిసిపోతున్న అచ్చ తెలుగు అందం!  


Also Read: Honey Rose Hot Pics: బ్లాక్ శారీలో హనీ రోజ్.. 'ఫిగర్' పోలా అదిరిపోలా! వైరల్ పిక్స్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.