5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ సేవల కోసం సుదీర్ఘ నిరీక్షణ నెలకొంది. ఎప్పుడెప్పుడా అని ప్రజలు నిరీక్షిస్తున్న పరిస్థితి. 5జీ మొబైల్ వచ్చేసింది కానీ నెట్‌వర్క్ మాత్రం ప్రారంభం కాలేదు. మరి ఇండియాలో 5జీ నెట్‌వర్క్ సేవలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో దాదాపు ఏడాది కాలంగా 5జీ నెట్‌వర్క్ సేవలు(5G Network Services)ఊరిస్తున్నాయి. ఈనెల, ఆ నెల అంటూ వాయిదా పడుతోంది కానీ నెట్‌వర్క్ సేవలు మాత్రం ప్రారంభం కావడం లేదు. ప్రకటనలైతే తెగ వస్తున్నాయి కానీ ఎప్పుడు ప్రారంభమవుతాయనేది తెలియడం లేదు. ఓ వైపు మార్కెట్‌లో 5జీ మొబైల్ ఫోన్లు కంపెనీలు విడుదల చేసేస్తున్నా..నెట్‌వర్క్ మాత్రం అందుబాటులో రావడం లేదు. మార్కెట్‌లో హ్యాండ్‌సెట్ల హడావిడి తప్ప నెట్‌వర్క్ సందడి కన్పించడం లేదు. ఎప్పుడో వచ్చేస్తుందనుకున్న 5జీ నెట్‌వర్క్ సేవలు ఎందుకింత ఆలస్యమవుతున్నాయో పరిశీలిద్దాం.


వాస్తవానికి 2021 మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం(Central government)5జీ ట్రయల్స్ కోసం వివిధ టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ట్రయల్స్ నిర్వహించేందుకు జియో, భారతి ఎయిర్‌టెల్(Airtel), వోడాఫోన్ ఐడియా(Vodafone idea), ఎంఎన్‌టిఎల్‌లు అనుమతి పొందాయి. నిర్దేశిత లక్ష్యం ప్రకారం నవంబర్ నెలలోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. దాంతో నవంబర్ నెల సమీపిస్తుండటంతో వాణిజ్యపరంగా 5జీ సేవలు ప్రారంభమవుతాయని అందరూ ఆశించారు. అయితే నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి కాలేదని..మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కో కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి(Central government)విజ్ఞప్తి చేశాయి. ఎందుకు ట్రయల్స్ పూర్తి కాలేదనేది తెలుసుకుందాం. 5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్‌మెంట్‌ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్‌సన్‌, నోకియా, శామ్‌సంగ్‌, సీ డాట్‌ తదితర ఎక్విప్‌మెంట్‌ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్‌(5G Network Trials)చేయలేని పరిస్థితి నెలకొంది. 


ఇప్పుడు టెల్కో కంపెనీలు కోరిన విధంగా మరోసారి ట్రయల్స్ గడువు పెంచిచే ఇక 5జీ నెట్‌వర్క్ సేవలు వాణిజ్యపరంగా అందుబాటులో వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు. అంటే 2022 ఏప్రిల్-జూన్ వరకూ నిరీక్షించాల్సి వస్తుంది. 


Also read: Flipkart: ఇక ఫ్లిప్‌కార్ట్‌లో వ్యవసాయ ఉత్పత్తులు, రైతులతో ఒప్పందాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook