5G Services: భారతదేశంలో 5జీ యుగం..గుడ్‌న్యూస్ చెప్పిన జియో సంస్థ..!
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
5G Services: ఈనెల 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈనేపథ్యంలో జియో తన యూజర్లకు గుడ్‌న్యూస్ అందించింది. దీపావళి కల్లా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో జియో 5జీ సేవలు ప్రారంభంకానున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఐతే 5జీ సేవలు అధిక ధరలు ఉంటాయని ప్రచారం జరిగింది. ఐతే ఇదేమి ఉండదని జియో ప్రకటించింది. తొలుత 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తామని స్పష్టం చేసింది.
తమ వినియోగదారులు 5జీ సేవల్లోని విలువను గుర్తించే వరకు కొత్త ధరలు అమలు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఇటు దేశంలోని 8 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దశలవారిగా దేశవ్యాప్తంగా 5జీ సేవలు అమలుకానున్నాయి. ఈనెల 1న ప్రగతి మైదానంలో ఆరో విడత ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2022 సదస్సు జరిగింది. ఈసందర్భంగా ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు. ఈసారి 5జీ ద్వారా అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలతోపాటు ఇతర సేవలు అందుబాటులోకి వచ్చాయి. 4జీతో పోలిస్తే అత్యంత వేగంగా 5జీ సేవలు పని చేస్తున్నాయి. 5జీ సేవల వల్ల ఏ వీడియోనైనా కొద్ది సెకన్లలోనే డౌన్‌లోడ్ అవుతోంది.
ఫుల్ లెన్త్ హై క్వాలిటీ వీడియోలు ఇట్టే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇటీవల 5జీ వేలం ప్రక్రియ పూర్తైంది. ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని జియో రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. ఎయిర్‌టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఒకటో తేదీ నుంచి పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీలోనూ అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో 5జీ సేవలు తీసుకురావాలన్నారు.
Also read:Hyderabad Traffic: భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు..!
Also read:IND vs SA: టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తుందా..? రేపే చివరి మ్యాచ్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook