7th Pay Commission DA Hike likely to Get Before Holi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 లక్షల మందితో పాటు మరియు 61 లక్షల మంది పెన్షనర్లు జూలై-డిసెంబర్ 2020 సమయానికిగానూ ఇవ్వాలని డీఏను 4 శాతం పెంచనున్నారు. తాజా రిపోర్టుల ప్రకారం.. ప్రభుత్వం హోలీకి ముందు జనవరి-జూన్ వరకు 4 శాతం డీఏ పెంపు ఉద్యోగులకు అందించాలని 7వ వేతన సంఘం(7th Pay Commission) సూచించినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా జూలై 2020లో నిలిపివేయబడిన డీఏను కూడా ప్రభుత్వం విడుదల చేయనుందని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జనవరి-జూన్ కోసం కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ(Dearness Allowance) పెంపును ప్రకటించవచ్చని జాతీయ మీడియా నివేదికలలో పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణం సమయంలో ఉద్యోగులకు చేదోడుగా ఉండేందుకు వీలుగా కేంద్ర ఉద్యోగులకు సంవత్సరానికి రెండుసార్లు డీఏను సవరిస్తుంది. జనవరి నుండి జూన్ వరకు తొలిసారి డీఏ సవరించగా, రెండవ సవరణ జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో చేస్తారు.


Also Read: Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు



ఇదొక్కటే కాదు, జూలై 2020లో తాత్కాలికంగా నిలిపివేసిన డీఏను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుందని 7వ వేతన సంఘం(7th Pay Commission Latest Updates) సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూడటంలో భాగంగా డీఏను నిలిపివేయడం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% తక్కువ అంటే 17శాతం డీఏను అందుకుంటున్నారు.


Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వివాదంలోనూ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన WhatsApp



జనవరి నుంచి జూన్ 2020 వరకు ఇవ్వాల్సిన పెండింగ్ 4 శాతం డీఏ, జులై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో చెల్లించాల్సిన మరో 4 శాతం డీఏ కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. ఈ పెండింగ్ 8 శాతం డీఏను అందిస్తే కేంద్ర ఉద్యోగుల డీఏ 25శాతానికి పెరగనుంది.  కేంద్ర ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు త్వరలో కొత్త వేతనాలు, పెన్షన్ రానున్నాయి.


Also Read: Farmers Tractor Rally: బారీకేడ్లను విచ్ఛిన్నం చేసుకుంటూ ఢిల్లీలో ముందుకు సాగుతున్న రైతులు



డీఏతో పాటు ట్రావెలింగ్ అలవెన్స్(Travel Allowance) కూడా పెరగనుందని సమాచారం. 7 వ వేతన సంఘం సూచనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8శాతం డీఏతో పాటు 8 శాతం టీఏ పెరగనుందని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook