7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జూలై నెల జీతం భారీగా పెరగనుంది. జూలైలో డీఏ 6 శాతం వరకూ పెరగనుంది. మరోవైపు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త ఇది. జూలై నెల జీతం భారీగా పెరగబోతోంది. డీఏ 6 శాతం పెరగడంతో పాటు పీఎఫ్, గ్రాట్యుటీ కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతం ఉంది. డీఏ పెరగడంతో..ట్రావెల్ అలవెన్స్, సిటీ అలవెన్స్ కూడా పెరగబోతున్నాయి. దీంతోపాటు ప్రోవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల కన్పించనుంది. అంటే మొత్తం జీతంలో భారీ పెరుగుదల కన్పిస్తుంది. 


పెరగనున్న పీఎఫ్, గ్రాట్యుటీ


జీ బిజినెస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ పీఎఫ్ , గ్రాట్యుటీ అనేది బేసిక్ శాలరీ, డీఏపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డీఏ పెరగడంతో సహజంగానే పీఎఫ్, గ్రాట్యుటీలు పెరగనున్నాయి. గత ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో 17 శాతం పెరుగుదల వచ్చింది. 2021 జూన్ నుంచి ఇప్పటివరకూ డీఏ 17 శాతం నుంచి 34 శాతానికి చేరుకుంది. ఫలితంగా ఈపీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతోంది. 


ట్రావెల్ అలవెన్స్ పెరుగుదల


డీఏ ఎప్పుడైతే పెరిగిందో ఆ ప్రభావం టీఏపై పడుతుంది. డీఏ 34 శాతమైనప్పుడు టీఏ కూడా పెరగవల్సిందే. ఏఐసీపీఐ అంచనాల ప్రకారం జూలైలో డీఏ పెరగనుంది. మే నెల గణాంకాల్లో కూడా పెరుగుదల కన్పిస్తే..కచ్చితంగా డీఏ 6 శాతం పెరుగుతుంది. ఇది కాకుండా ఏడాదిన్నర అంటే 18 నెలల నుంచి పెండింగులో ఉన్న డీఏ ఎరియర్‌పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల పెండింగ్ డీఏ ఎరియర్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. జూలై నెలలో ఈ విషయంపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు జూలై నెల నుంచి భారీగానే పెరగనున్నాయి. 


Also read: Whatsapp New Feature: కేవలం మహిళల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెడుతున్న వాట్సప్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.