7th Pay Commission DA Hike: కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇవ్వనుందా..? పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయని పక్షంలో ఎలాంటి ప్రకటన చేయనుంది..? నేడు జరగబోయే కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఇవ్వందా..? శుక్రవారం జరగనున్న మోదీ కేబినెట్ సమావేశంలో 65 లక్షల మంది ఉద్యోగులు, 50 లక్షల మంది పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ అలవెన్స్‌పై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, నివారణ చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై) కింద లభించే ఉచిత రేషన్‌ను కూడా పొడిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 శాతం కరువు భత్యం పెంపుపై మోదీ కేబినెట్ నుంచి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడితే ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా నిలుస్తుంది. అక్టోబరు వరకు ఏఐసీపీఐ సూచీ గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబర్‌లో ఏఐసీపీఐ సూచీ 1.2 పాయింట్లు పెరిగి 132.5 స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 131.3 శాతంగా ఉంది.


డీఏ 42 శాతానికి పెంపు..!


డీఏను 4 శాతం పెంచితే అది 42 శాతానికి పెరుగుతుంది. సెప్టెంబరులో డీఏ పెంపు ఆధారంగా ప్రస్తుతం 38 శాతంగా ఉంది. ఈ పెంపు తర్వాత ఉద్యోగుల జీతంలో మంచి పెంపుదల ఉంటుంది. ఏడవ వేతన సంఘం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. జనవరి 2022, జులై 2022లో మొత్తం 7 శాతం డీఏను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 


కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యల కారణంగా బకాయిలను విడుదల చేయడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. దీంతో ఎంతోకాలంగా పెండింగ్ డీఏ కోసం ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. 7వ వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ రిలీజ్ చేయడం కుదరని చెప్పింది.  


కరోనా మహమ్మారి కారణంగా జూలై 2020 నుంచి 18 నెలల వరకు మూడు విడతల డీఏ బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. జూలై 2021లో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ని పునరుద్ధరించింది. అయితే  18 నెలలుగా చెల్లించని మూడు చెల్లింపుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఆర్థిక మంత్రి శాఖ రాజ్యసభలో సమాధానమిస్తూ.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెన్షనర్లకు డీఏ‌లో మూడు విడతలు విడుదల చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొంది. 


Also Read: Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ కన్నుమూత.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్  


Also Read: Kaikala Satyanarayana Death: పాత్రలకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు.. కైకాల సత్యనారాయణ తొలి, చివరి సినిమాలు ఇవే!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook