7th Pay Commission DA Hike Formula: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్‌ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త సంవత్సరంలో కొత్త ఫార్ములాతో డియర్‌నెస్ అలవెన్స్ లెక్కింపు జరుగుతుంది. అంతేకాకుండా కేంద్ర ఉద్యోగులు అందుకున్న డీఏ పెంపుపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి లెక్కింపు సూత్రాన్ని మార్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్మిక మంత్రిత్వ శాఖ 2016 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని డీఏ పెంచుతోంది. ఇందుకు సంబంధించిన వేతన రేటు ఇండెక్స్ కొత్త సిరీస్ (వేతన రేటు సూచిక) విడుదల చేసింది. పాత సిరీస్‌ను 1963-65 బేస్ ఇయర్ స్థానంలో కొత్త సిరీస్ 2016=100 బేస్ ఇయర్‌తో లెక్కించనున్నారు. 


7వ పే కమిషన్ కింద బేసిక్ పేతో ప్రస్తుతం ఉన్న డీఏ రేటుతో గుణించి డియర్‌నెస్ అలవెన్స్‌ పెంచుతారు. ప్రస్తుతం 12 శాతం రేటు ఉంది. ఉదాహరణకు మీ బేసిక్ శాలరీ రూ.18 వేలు అనుకుంటే.. డీఏ (18000x12)/100. డియర్‌నెస్ అలవెన్స్ శాతం = గత 12 నెలల సీపీఐ సగటు-115.76. ఇప్పుడు ఎంత వచ్చినా దానిని 115.76తో భాగిస్తారు. వచ్చే సంఖ్య 100తో గుణించి డీఏను పెంచతారు.


డీఏ పెంపుపై పన్ను చెల్లించాల్సి ఉంటుందా..?


డియర్‌నెస్ అలవెన్స్ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మన దేశంలోని ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్‌లో డియర్‌నెస్ అలవెన్స్ గురించి ప్రత్యేక సమాచారం ఇవ్వాలి. డీఏ పేరుతో మీరు పొందే మొత్తానికి మీరు ట్యాక్స్ చెల్లించాలి.


ఎంత ప్రయోజనం పొందుతారు..?


7వ పే కమిషన్ కింద జీతం లెక్కింపు కోసం.. ఉద్యోగి బేసిక్ శాలరీని బట్టి డీఏను లెక్కిస్తారు. కేంద్ర ఉద్యోగి కనీస ప్రాథమిక వేతనం రూ.26 వేలు అనుకుందాం. అప్పుడు అతని డీఏ లెక్కింపు 26 వేలలో 38 శాతం అవుతుంది. అంటే మొత్తం రూ.9,880 అవుతుంది. వచ్చే డీఏ పెంపులో ప్రతి నెలా జీతంలో రూ.910 పెరగవచ్చు.  


డియర్‌నెస్ అలవెన్స్ అంటే..?


ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీవనం, ఆహారం కోసం డియర్‌నెస్ అలవెన్స్ కేంద్ర ఇస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిన తర్వాత కూడా ఉద్యోగి జీవన ప్రమాణాల్లో తేడా రాకపోవడంతో దీన్ని ప్రారంభించారు. ఈ డబ్బును ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు అందజేస్తారు. డీఏను మన దేశంలో మొదటిసారిగా 1972లో ముంబై నుంచి ప్రవేశపెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వడం ప్రారంభించారు.


డియర్‌నెస్ అలవెన్స్ రకాలు


డియర్‌నెస్ అలవెన్స్ రెండు విధాలుగా అందజేస్తారు. ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్, వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్. ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ ప్రతి 3 నెలలకు మారుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ (పీఎస్‌యూ)లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మాత్రమే. ఇది వినియోగదారు ధర సూచిక (CPI) యొక్క ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా లెక్కిస్తారు. అదే సమయంలో ప్రతి 6 నెలలకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతారు. ఇది వినియోగదారు ధర సూచిక (CPI) ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా కూడా లెక్కిస్తారు.


డీఏ ఎంత పెంచవచ్చు..?


వచ్చే ఏడాది జనవరిలో నాలుగు శాతం పెరుగుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలతో డీఏ 42 శాతానికి చేరుకుంటుంది. అయితే పెంపు కచ్చితంగా ఎప్పుడు ఉంటుందనే క్లారిటీ ఇంకా రాలేదు. డీఏ పెంపు వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.


Also Read: IPL Mini Auction: సెహ్వాగ్ మేనల్లుడుపై కాసుల వర్షం.. వేలంలో దక్కించుకున్న సన్‌రైజర్స్  


Also Read: IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే.. టీమిండియా నుంచి ఒక్కడే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook