7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఫిట్‌మెంట్ పెరగడంతో ఉద్యోగుల జీతం కూడా పెరగబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్‌న్యూస్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో నిర్ణయం తీసుకోనుంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ సిద్ధమైంది. జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం..డ్రాఫ్ట్ సమర్పించిన తరువాత ఈ నెలాఖరులోగా ఈ అంశంపై భేటీ ఉండవచ్చు. భేటీలో ఆమోదం లభిస్తే ఏకంగా 52 లక్షలమంది ఉద్యోగులకు కనీస వేతనం పెరగబోతోంది. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా కరవు భత్యం అమలు కానుంది.  ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం ఈ నెల కరవు భత్యం 4-5 శాతం వరకూ పెరగవచ్చు. అంటే మొత్తం డీఏ 38-39 శాతానికి చేరవచ్చు. ఇప్పటివరకూ జూలై నెల ఏఐసీపీఐ ఇండెక్స్ విడుదలయ్యాయి. ఈలోగా ఫిట్‌మెంట్ ఫ్యాక్ట్రర్‌పై ప్రభుత్వం ఆమోదిస్తే..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, పెన్షనర్ల పెన్షన్ పెరగనున్నాయి. ఈలోగా యూనియన్ 8వ వేతన సంఘం కోసం డిమాండ్ చేస్తోంది. 


7వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి నిర్ణయమౌతుంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే కనీస వేతనం కూడా పెరుగుతుంది. ఇదే ఫార్ములాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రెండున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లుగా ఉంది. దీని ఆధారంగా కనీస వేతనం 18 వేల రూపాయలుగా ఉంది. అత్యధికంగా 56,900 రూపాయలుంది. 


Also read: ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చాయా..తక్షణం ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook